Breaking News

22/02/2019

భారత్‌ నీళ్లు మళ్లించుకున్నంత మాత్రాన తమకు నష్టం లేదు:పాక్

ఇస్లామాబాద్‌ ఫిబ్రవరి 22 (way2newstv.in
పుల్వామా దాడిపై ఆగ్రహంగా ఉన్న భారత్‌ సింధూ జలాల ఒప్పందం కింద దక్కిన నదీ జలాల్లోని మన వాటా నీటిని పాకిస్థాన్‌కు ప్రవహించకుండా ఆపెయ్యాలని నిర్ణయం తీసుకున్న నిర్ణయం ఫై పాక్‌ స్పందించింది. భారత్‌ నీళ్లు మళ్లించుకున్నంత మాత్రాన తమకు వచ్చిన నష్టమేమీ లేదని, దీనిపై తాము ఎలాంటి ఆందోళనా చెందడం లేదని పాక్‌ నీటిపారుదలశాఖ సెక్రటరీ ఖవాజా షుమాలి అన్నారు. ఈ మేరకు పాక్‌ పత్రిక డాన్‌తో ఆయన మాట్లాడారు.‘‘తూర్పు ప్రాంత నదుల జలాల్ని మళ్లించడంపై మాకు ఎలాంటి అభ్యంతరమూ, ఆందోళనా లేదు. భారత్‌ తీసుకున్న నిర్ణయం పట్ల మేమేమీ చింతిండం లేదు.


భారత్‌ నీళ్లు మళ్లించుకున్నంత మాత్రాన తమకు నష్టం లేదు:పాక్

మేం ఉపయోగించుకునే సింధు, జీలం, చీనాబ్‌ నదీ జలాల నీటిని అడ్డుకుంటే మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తాం. అప్పుడు అభ్యంతరం వ్యక్తం చేస్తాం. 1960లో కూడా తూర్పు ప్రాంత నదుల జలాల్ని వారి కోసం మళ్లించుకున్నారు. ఆ సమయంలో మేమేమీ అభ్యంతరం చెప్పలేదు. ఇప్పుడు అదే పని చేస్తున్నారు. మాకే ఇబ్బంది లేదు’’ అని ఆయన అన్నారు.సింధూ జల ఒప్పందంలో భాగంగా సింధు, జీలం, చీనాబ్‌ నదులు పాక్‌కు దక్కగా, రావి, బియాస్‌, సట్లెజ్‌ నదులు భారత్‌కు దక్కాయి. పుల్వామా దాడి నేపథ్యంలో మనదేశంలోని తూర్పు ప్రాంతంలో ప్రవహించే నదీ జలాల్ని పాకిస్థాన్‌కు వెళ్లకుండా నిలువరించాలని నిర్ణయించినట్లు కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం ప్రకటించారు. ఆ నీటిని మళ్లించి జమ్ముకశ్మీర్‌, పంజాబ్‌ ప్రజలకు అందిస్తామన్నారు. ‌

No comments:

Post a Comment