Breaking News

12/02/2019

ప్రచార 'సిత్రాలు'

కర్నూలు, ఫిబ్రవరి 12, 2019 (way2newstv.in)
ఎన్నికల వేళ మాటల తూటాలు, ప్రచార ఆర్భాటాలు, జెండాలు, అజెండాలతో నెలకొనే సందడి అందరికీ తెలిసిందే. ఈసారి ఎన్నికల్లో సరికొత్త సందడి కనిపిస్తోంది. అవే.. నేతల బయోపిక్‌లు, వారి జీవిత విశేషాలతో కూడిన సినిమాలు. ఎన్నికలంటే ఒకప్పుడు నేతల ప్రచారంపై ప్రజల్లో ఆసక్తి ఉండేది. ప్రస్తుతం సినిమాలపై ఉంటోంది. ఎందుకంటే ఎలక్షన్ సీజన్ లో ప్రజా సమస్యలను హైలెట్ చేస్తున్న మూవీలే కాదు పార్టీల మెయిన్ లీడర్స్ పై బయోపిక్ లూ రిలీజ్ అవుతున్నాయి. 


 ప్రచార 'సిత్రాలు'

ఈ చిత్రాల్లో తమ నేతల నాయకత్వ లక్షణాలు, ప్రజల కోసం వారు పడిన తపనను చూపిస్తున్నాయి. మొత్తంగా సినిమాలతోనూ ఓటర్లను ఆకట్టుకునే కార్యక్రమానికి తెరతీశాయి రాజకీయ పక్షాలు. దేశంలోని ప్రముఖ రాజకీయ నేతలకు సంబంధించి డజనుదాకా సినిమాలు వెండితెరపై కనువిందు చేస్తున్నాయి. కొందరు నేతలపై ఏకంగా రెండు మూడు సినిమాలు వస్తుండటం విశేషం. మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌పై రూపొందించిన చిత్రం ఇప్పటికే ఆరోపణలు, ప్రత్యారోపణలకు తెరలేపింది. ఈ క్రమంలో బాక్సాఫీసు డైలాగులు, వ్యంగ్యాస్త్రాలతో వేడెక్కింది. పొలిటికల్ లీడర్స్ పై రూపొందుతున్న సినిమాలు వినోదం కోసమే కాదు. తమకు ఇబ్బడిముబ్బడిగా రాజకీయ ప్రయోజనాలు తెచ్చిపెడతాయని కొన్ని పార్టీలు భావిస్తున్నాయి. ఇక ఎన్నికలవేళ వరుసగా రిలీజ్ అవుతున్న ఈ బయోపిక్ లు తమకు ప్లస్ అవుతాయని, ప్రజాదరణ పెరుగుతుందని విశ్వసిస్తున్నాయి.
జనాలపై మూవీ ప్రభావం తక్కువే అన్నది సినీ జనాల మాట. అయితే సినిమాల ఎఫెక్ట్ ప్రజలపై ఎంతోకొంత ఉంటుంది. ఇది కాదనలేని సత్యం. అందుకే ఎన్నికల వేళ కొన్ని పార్టీలు తమ టాప్ లీడర్స్ జీవిత కథలను తెరకెక్కించేస్తున్నాయి. సి‌ని‌మాలు.‌.‌ ప్రజల హృద‌యా‌లకు చేరు‌వ‌య్యేందుకు చక్కటి ప్రచార సాధ‌నాలు.‌ అందుకే ఇప్పుడు రాజ‌కీ‌య‌నా‌య‌కుల చూపు థియే‌ట‌ర్లవైపు పడింది.‌ ఎన్టీ‌ఆర్, వైయ‌స్సార్, ఇందిరా గాంధీ, మన్మో‌హన్‌ సింగ్, బాల్‌ ఠాక్రే వంటి నాయ‌కులు తమ‌దైన అద్భు‌త‌మైన నాయ‌కత్వ లక్షణాలు, ప్రతి‌భతో ప్రజల మదిలో చిర‌స్థా‌యిగా నిలి‌చారు.‌ కాబట్టి వారిని, వారు చేసిన పను‌లను గుర్తు‌చే‌యడం ద్వారా ప్రజల్లో ఓ సాను‌భూతి భావమో పార్టీ పట్ల అను‌కూ‌ల‌మైన ప్రభా‌వమో పడే అవ‌కా‌శ‌ముంటుంది.‌ టా‌లీ‌వు‌డ్‌లో నేతల బయోపిక్ ల సందడి జోరుగానే ఉంది. ఇప్పటికే తెలంగాణ సీఎం కేసీఆర్ పై‌ రూపొందిన చిత్రాలు థియేటర్లలో సందడి చేశాయి. ఇక ఎన్టీఆర్ కథానాయకుడూ ఆకట్టుకుంది. ఎన్టీఆర్ మహానాయకుడు త్వరలోనే రిలీజ్ కానుంది. ఇక వైఎస్సార్ పై తెరకెక్కిన యాత్ర హల్ చల్ చేస్తోంది. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబుపైనా చంద్రోదయం పేరుతో సినిమా రూపొందుతోంది. రామ్ గోపాల్ వర్మ డైరక్ట్ చేస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ పైనా జనాల్లో ఆసక్తి ఉంది. ఈ సినిమాలను ఆయా పార్టీలు కలిసివచ్చే ఎన్నికల ప్రచారంగానే భావిస్తున్నాయి. సినిమా పరిధి విస్తృతంగా ఉంటుంది. నిరక్షరాస్యులను కూడా ప్రభావితం చేయగలదు. కాబట్టి పలు రాజకీయపార్టీలు ఎన్నికల ప్రచారంలో ఈసారి సినిమాకు ప్రాధాన్యతనిస్తున్నాయి. కేవలం తమ ప్రచారాని కే పరిమితం చేయకుండా ప్రత్యర్ధి పక్షాన్ని ఇబ్బంది పెట్టేందుకూ మూవీలను వాడుకుంటున్నాయి. 
  

No comments:

Post a Comment