Breaking News

12/02/2019

గజ్వెల్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ర్యాలీ

ముంపు గ్రామాల యువకులు సైతం ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలి
సిద్ధిపేట , ఫిబ్రవరి 12 ( way2newstv.in) ఇండియన్ ఏయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్ ర్యాలీ ఫిబ్రవరి నెల 26వ తేదిన గజ్వేల్ పట్టణంలో జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ ఆదేశాల మేరకు ఈ రిక్రూట్ మెంట్ ర్యాలీని నిర్వహించనున్నట్లు జాయింట్ కలెక్టర్ పద్మాకర్ అన్నారు . సిద్ధిపేట జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో మంగళ వారం ఉదయం ఇండియన్ ఏయిర్ ఫోర్స్ సిబ్బంది, డీఆర్వో చంద్రశేఖర్ లతో కలిసి ఫిబ్రవరి నెలలో 26, 27, 28, మార్చి 1వ తేదిలలో గజ్వేల్ పట్టణంలో నిర్వహించ తలపెట్టిన ఇండియన్ ఏయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్ ర్యాలీ అంశాలపై చర్చించారు. 


 గజ్వెల్ లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ర్యాలీ


ఈ మేరకు ఫిబ్రవరి 26వ తేదిన ఉదయం 5గంటలకు గజ్వేల్ పట్టణంలోని ఐవోసీ  బిల్డింగ్ కాంప్లెక్ ఇంటిగ్రేటెడ్ ఆఫీసు కాంప్లెక్స్ మైదానం వద్ద జరిగే ఏయిర్ ఫోర్స్ రిక్రూట్ మెంట్ ర్యాలీకి హాజరయ్యే ఆసక్తి కలిగిన ఉన్న అభ్యర్థులు ( అబ్బాయిలు ) 25వ తేది సాయంత్రం వరకు గజ్వేల్ పట్టణంలో అందుబాటులో ఉండాలని కోరారు. 26, 27వ తేదిలలో నల్గొండ, సూర్యాపేట, యాదాద్రి, భువనగిరి, నిజామాబాదు, కామారెడ్డి, రంగారెడ్డి, మేడ్చేల్, వికారాబాద్, వరంగల్ రూరల్, వరంగల్ అర్బన్ జిల్లా, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, హైదరాబాదు జిల్లాలోని అభ్యర్థులకు 26, 27వ తేదిలలో రిక్రూట్ మెంట్ నిర్వహించనున్నట్లు వివరించారు.  అదే విధంగా ఫిబ్రవరి నెలలోని 28వ తేది మార్చి నెల 1వ తేది రోజులలో ఆదిలాబాదు, కొమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, రాజన్న సిరిసిల్ల, భద్రాద్రి, కొత్త గూడెం, ఖమ్మం, జోగులాంబ గద్వాల్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాలోని ఆసక్తి కలిగిన అభ్యర్థులు కేటాయించిన తేదిలలో హాజరు కావాలని కోరారు.
అర్హతలు
* ఇంటర్ మీడియేట్ ఉత్తీర్ణత సాధించి ఉండాలి 
* మొత్తం 50% మార్కులు సాధించి ఉండాలి , ఇంగ్లీష్ సబ్జెక్టు లో 50% మార్కులు సాధించి ఉండాలి 
* 19 జనవరి 1999 నుండి 1 జనవరి 2003 మధ్యకాలంలో జన్మించి ఉండాలి 
* అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్లతొ హాజరు కావలసి ఉంటుంది
* వీరు 5 నిమిషాల 40 సెకన్ల సమయంలో 1.6 కిలోమీటర్ల  పరుగు పందెంలో పాల్గొనవలసి ఉంటుందని ఆయన అన్నారు

No comments:

Post a Comment