Breaking News

13/02/2019

కన్నడ బిగ్ బాస్ లో లైంగిక వేధింపులు

బెంగళూర్, ఫిబ్రవరి 13, (way2newstv.in)
నెం.1 టెలివిజన్ రియాలిటీ షోగా దూసుకుపోతున్న బిగ్ బాస్ కార్యక్రమంలో లైంగిక వేధింపుల వ్యవహారం తాజాగా వెలుగులోకి వచ్చింది. కన్నడ బిగ్ బాస్ షోలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని నటి కవితా గౌడ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ షోలో కంటెస్టంట్ గా పాల్గొన్న కవితా మధ్యలోనే బయటకు వచ్చేసింది. కాగా, తన తోటి కంటెస్టంట్ యాండీపై ఫిర్యాదు చేయడం కలకలంగా మారింది. 

 
కన్నడ బిగ్ బాస్ లో లైంగిక వేధింపులు

హౌస్ లో ఉన్నంతకాలం అతడి ప్రవర్తన సరిగ్గాలేదని, తనపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు కన్ఫెషన్ రూమ్ లో చెప్పిందట. కానీ ఆటలో ఇలాంటివి సాధారణం అని చెప్పడంతో కామ్ గా ఉన్నానని చెప్పుకొచ్చింది. షోలో జరిగిన వేధింపుల గురించి కార్యక్రమం నిర్మాత గురుదాస్ శనైకి ముందే చెప్పానని ఆమె పేర్కొంది. షోలో భాగంగా రెండు రోజుల పాటు ‘సూపర్‌ హీరో వర్సెస్‌ సూపర్‌ విలన్‌’ టాస్క్‌ జరిగిన సమయంలో యాండీ లైంగిక వేధింపులకు దిగాడని కవితా ఆరోపించింది. అయితే, తనకు జరిగిన అన్యాయం గురించి షో నుండి బయటకి వచ్చిన తరువాతే ఫిర్యాదు చేస్తున్నట్లు చెప్పింది. ఈ విషయంపై స్పందించిన యాండీ హౌస్ నుండి బయటకి వెళ్లిన తరువాత కవిత తనను కలవలేదన్నాడు. బిగ్ బాస్ పోటీలలో ఓటమిని తట్టుకోలేక తనపై తప్పుడు ఆరోపణలు చేస్తోందని ఎదురుదాడికి దిగాడు

No comments:

Post a Comment