Breaking News

23/02/2019

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో చోరీ

హైద్రాబాద్, ఫిబ్రవరి 23 (way2tvnews.com
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. ఈ మేరకు హైదరాబాద్ బంజారాహిల్స్‌లో కేసు నమోదైంది. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ రోడ్ నెం.1 ఫిల్మ్ నగర్‌లో ఉన్న మోహన్ బాబు ఇంట్లో.. ల‌క్ష రూపాయ‌ల న‌గ‌దు, ఆభ‌ర‌ణాలు చోరికి గురైన‌ట్టు తెలుస్తుంది. ఈ మేరకు మోహన్ బాబు మేనేజర్‌ బంజారా హిల్స్ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. నమ్మకంగా పనిచేస్తున్న పనిమనిషి మీదే అనుమానం ఉన్నట్లుగా మేనేజర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. 


కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో చోరీ 

కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టి చోరీకి గురైన ఆస్తి వివరాలను రాబట్టే పనిలో ఉన్నారు. అయితే ఫిల్మ్ నగర్‌లో ఉన్న మోహన్ బాబు ఇంటిలోపలికి బయట వ్యక్తులు వెళ్లే అవకాశం లేదు. ఇంటి ముందు ఎప్పుడూ ప్రైవేట్ సెక్యురిటీ ఉంటుంది. ఇక సెలబ్రిటీల ఇంట్లో మనిమనుషులు చేతివాటం ప్రదర్శించడం తరచూ జరుగుతుంది. ఇటీవల నటి భానుప్రియ ఇంట్లో దొంగతనం జరగగా.. తిరిగి భానుప్రియపైనే కేసు పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఈ కేసుపై విచారణ జరుగుతుండగా.. గతంలో చిరంజీవి ఇంట్లోనూ దొంగతనం జరిగింది. ఈసారి మోహన్ బాబు వంతు రావడంతో సెలబ్రిటీలు అలర్ట్ అవుతున్నారు. 

No comments:

Post a Comment