Breaking News

23/02/2019

పుట్టిన వెంటనే కుల ధృవీకరణ పత్రం జారీ: సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ ఫిబ్రవరి 23 (way2newstv.in
రాబోయే కొన్ని నెలల్లోనే పలు సంస్కరణలు అమలు కాబోతున్నాయి. మార్పునకు అనుగుణంగా పరిపాలకులు మారాలి. పుట్టిన వెంటనే కుల ధృవీకరణ పత్రం జారీ చేస్తాం. సర్టిఫికెట్ల జారీలో ఉన్న లొసుగులను సరి చేస్తాం. మనిషి పుట్టగానే క్యాస్ట్‌ సర్టిఫికెట్‌ ఇవ్వాలి. మున్సిపాలిటీల్లో లంచం ఇవ్వకుండా పనులు జరిగే రోజులు రావాలి. పార్లమెంట్‌ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన వెంటనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్‌ ఎన్నికలు నిర్వహిస్తాం. 


పుట్టిన వెంటనే కుల ధృవీకరణ పత్రం జారీ: సీఎం కేసీఆర్‌

త్వరలోనే కొత్త మున్సిపల్‌ చట్టాన్ని తీసుకురాబోతున్నామని కేసీఆర్‌ వివరించారు. విపక్షాలు కనీస అవగాహన లేకుండా ఆరోపణలు చేస్తున్నాయని సీఎం కేసీఆర్‌ మండిపడ్డారు. కేంద్ర పాలకులకు రాజకీయ ప్రాధమ్యాలు పెరిగిపోయాయి. కేంద్రంలోని పెద్దలకు ఎప్పుడు జ్ఞానోదయమవుతుందో! ప్రధాని మోదీ చెబుతోన్న సహకార సమాఖ్య ఎక్కడా లేదు. ఉమ్మడి జాబితాలోని అంశాలతో సమస్యలు. దళితులు, గిరిజనులు ఇప్పటికీ అభివృద్ధికి దూరంగానే ఉన్నారని అసెంబ్లీలో కేసీఆర్‌ పేర్కొన్నారు.ప్రజలకు ఎలాంటి వేధింపులు లేకుండా చూస్తామని ముఖ్యమంత్రి అన్నారు. 

No comments:

Post a Comment