Breaking News

20/02/2019

16 ఏళ్ల‌లో నిలిచిన 793 సినిమాలు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 20  (way2newstv.in): 
సెన్సార్ బోర్డు సీబీఎఫ్‌సీ  16 ఏళ్ల‌లో మొత్తం 793 సినిమాల‌ను రిలీజ్ చేయ‌కుండా అడ్డుకున్న‌ది. ల‌క్నోకు చెందిన నూత‌న్ థాకూర్ వేసిన పిటిష‌న్‌కు ఆర్టీఐ ఈ స‌మాధానం ఇచ్చింది. జ‌న‌వ‌రి 1, 2000 సంవ‌త్స‌రం నుంచి మార్చి 31, 2016 వ‌ర‌కు ఈ సినిమాల‌ను సెన్సార్ బోర్డు నిషేధించింది. ప‌ద‌హారేళ్ల కాలంలో 793 సినిమాల‌కు సెన్సార్ బోర్డు స‌ర్టిఫికెట్ ఇవ్వ‌లేద‌ని అత‌ను తెలిపాడు. 


16 ఏళ్ల‌లో నిలిచిన 793 సినిమాలు

ఇందులో 586 దేశీయ‌, 207 విదేశీ చిత్రాలు ఉన్నాయి. వీటిలో 231 హిందీ సినిమాలున్నాయి. త‌మిళ భాష‌కు చెందిన 96, టాలీవుడ్‌కు చెందిన 53, క‌న్న‌డ‌కు చెందిన 39, మ‌ల‌యాళంకు చెందిన 23, పంజాబ్‌కు చెందిన 17 సినిమాలున్నాయి. 2015-16 సంవ‌త్స‌రంలో అత్య‌ధికంగా 153 సినిమాల‌కు స‌ర్టిఫికెట్ ఇవ్వ‌లేదు. ఎక్కువ‌గా సెక్స్‌, క్రైమ్ క‌థాంశంతో ఉన్న సినిమాల‌కు సెన్సార్ బోర్డు అనుమ‌తి ఇవ్వ‌లేదు. ఆ లిస్టులో ఆద‌మ్‌కోర్ హ‌సీనా, కాతిల్ షికారి, ప్యాసీ చాందినీ, మ‌ధుర‌స్వ‌ప్నం, ఖూనీరాత్‌, శంసాన్ ఘాట్‌, మంచ‌లి ప‌డోస‌న్‌, సెక్స్ విజ్క్షానం లాంటి చిత్రాలు ఉన్నాయి.

No comments:

Post a Comment