Breaking News

20/02/2019

ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం

హైద్రాబాద్, ఫిబ్రవరి 20  (way2newstv.in): 
హైదరాబాద్ శివార్లలోని ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి అందులో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి సజీవ దహనమయ్యాడు. సంగారెడ్డి సమీపంలోని అమీన్‌పూర్ రింగ్ రోడ్డుపై బుధవారం  ఉదయం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగి చూస్తుండగానే కాలి బూడిదైంది. అందులో ప్రయాణిస్తున్న మరో వ్యక్తి సురక్షితంగా బయటపడ్డట్టు తెలుస్తోంది. 


ఔటర్ రింగ్ రోడ్డుపై ఘోర ప్రమాదం

కారుకు మంటలు అంటుకోవడం చూసిన ఇతర వాహనదారులు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. డోర్లు తెరుచుకోకపోవడంతో మంటల్లో చిక్కుకున్న వ్యక్తి చూస్తుండగానే కాలి బూడిదయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. కానీ, అప్పటికే నష్టం జరిగిపోయింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అమీన్‌పూర్ మండలం సుల్తాన్‌పూర్ ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై ఈ ప్రమాదం జరిగింది. మేడ్చల్ నుంచి ఇద్దరు వ్యక్తులు పఠాన్‌చెరు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. 

No comments:

Post a Comment