Breaking News

21/08/2018

రెండు పెను ప్రమాదాలు తప్పాయి : మంత్రి హరీష్ రావు

హైదరాబాద్, ఆగష్టు 21 (way2newstv.in) 
ఎన్ డబ్ల్యూడిఏ సమావేశంలో నదుల అనుసంధానంపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం తరుపున  మా అభిప్రాయాన్ని స్పష్టంగా తెలిపాం.  మా రాష్ట్ర అవసరాలు తీర్చిన తర్వాత మిగిలిన నీటిని తీసుకోవడంలో మాకు అభ్యంతరం లేదని తెలిపామని మంత్రి హరీష్ రావు అన్నారు. సోమవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. సీతారామ ప్రాజెక్టుకు అన్ని అనుమతులు త్వరగా  ఇవ్వాలని కోరాం. తెలంగాణకు కేటాయించిన 954 టీఎంసీల నికర జలాలు పోగా మిగిలిన నీటిని తీసుకోండి. మా ప్రాజెక్టులకు  హైడ్రాలజీ  క్లియరెన్స్ ఇవ్వకుండా నదుల అనుసంధానానికి dpr తయారుచేయడాన్ని మేం గట్టిగా వ్యతిరేకించాం.  తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ కు కేటాయింపులు జరిగాక నదుల అనుసంధానంపై ఆలోచించాలని స్పష్టం చేశాం. ఇదే అంశాన్ని రాతపూర్వకంగా కేంద్రమంత్రికి అందించామని అన్నారు.  జాతీయ హోదా ఏ ప్రాజెక్టులకు ఇవ్వడంలేదని పార్లమెంటు లో కేంద్ర మంత్రి  చెప్పారు.



రెండు పెను ప్రమాదాలు తప్పాయి : మంత్రి హరీష్ రావు

 కానీ 60: 40 నిష్పత్తిలో గ్రాంట్లు ఇస్తామని ఇస్తామని స్పష్టం చేశారు. మహారాష్ట్ర లో కొన్ని ప్రాజెక్టులకు గ్రాంట్లు ఇచ్చినట్లుగానే,  తెలంగాణకు గ్రాంట్లు ఇవ్వాలని కోరాం. మా ఇంజనీర్లు రాష్ట్రం లో అహర్నిశలు శ్రమిస్తున్నారు. మా ఇంజనీర్ల అప్రమత్తతతో రెండు పెను ప్రమాదాలు పెను ప్రమాదం తప్పాయి. ఆదిలాబాద్ జిల్లా సాత్నాల దగ్గర భారీ ప్రమాదాన్ని అపగలిగాం. పిడుగుపాటుకు జనరేటర్ పాడైన విపత్కర పరిస్థితుల్లో ప్రాజెక్ట్ సామర్థ్యం కన్నా ఎక్కువ ఇన్ ఫ్లో వచ్చినప్పుడు కాలినడకన వెళ్లి మన్యువల్ గా గేట్లను ఎత్తి ప్రమాదం నుంచి కాపాడారని అయన అన్నారు. కడెం ప్రాజెక్టు దగ్గర మరో ప్రమాదం తప్పింది. ఒక గేటు ఓపెన్ కాకపోవడంతో చాలా ఇబ్బంది ఏర్పడింది. ఇప్పటికప్పుడు ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రాజెక్టుల పనితీరు,  పరిస్థితులపై సమీక్ష నిర్వహిస్తున్నారని మంత్రి అన్నారు. ప్రతి ప్రాజెక్ట్ కు ప్రత్యేక  సమయాన్ని కేటాయించి త్వరితగతిన పనులు పూర్తయ్యేలా అధికరులను ఆదేశిస్తున్నారని అయన అన్నారు. 

No comments:

Post a Comment