Breaking News

24/07/2018

వామపక్ష తీవ్రవాద ఫ్రభావిత ప్రాంతాల్లో టెలికమ్యునికేషన్ వ్యవస్థ పటిష్టం సిఎస్ లు,డిజిపిలతో కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా వీడియో సమావేశం.

అమరావతి, జూలై 24   (way2newstv.in)  
దేశంలోని వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో టెలికమ్యునికేషన్ వ్యవస్థ,రహదారులు తదితర మౌళిక సదుపాయాల అభివృద్ధి విషయమై కేంద్ర కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా సోమవారం డిల్లీ నుండి వివిధ రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు,పోలీస్ డైరెక్టర్ జనరల్ లతో వీడియో సమావేశం నిర్వహించారు.ఈసందర్భంగా వివిధ రాష్ట్రాల్లో ఇందుకు సంబంధించిన ప్రాంతాల్లో చేపడుతున్న వివిధ కార్యక్రమాలు,పధకాలకు సంబంధించిన ప్రతిపాదనలు,పనుల ప్రగతిని ఆయన సిఎస్ లతో సమీక్షించారు.ముఖ్యంగా వామపక్ష తీవ్రవాద ఫ్రభావిత ప్రాంతాల్లో టెలికమ్యునికేషన్ వ్యవస్థ,రహదారులు,ఇతర మౌళిక సదుపాయాల అభివృద్ధికి సంబంధించి చేపట్టిన పనులను వేగవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు.అదేవిధంగా ఈప్రాంతాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని తగిన బ్యాంకు బ్రాంచిలు అందుబాటులో లేనిచోట బ్యాంకింగ్ కరస్పాండెంట్లు(బిసిలు)ను నియమించి ఈసేవలు అందించాలని బిసిలుగా స్వయం సహాయక సంఘాల మహిళలను కూడా నియమించి బ్యాంకింగ్ ఈసేవలు అందించేందుకు కృషి చేయాలని చెప్పారు.



వామపక్ష తీవ్రవాద ఫ్రభావిత ప్రాంతాల్లో టెలికమ్యునికేషన్ వ్యవస్థ పటిష్టం
సిఎస్ లు,డిజిపిలతో కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా వీడియో సమావేశం.

గిరిజన మారుమూల ప్రాంతాల్లో తగినన్ని మోడల్ స్కూళ్లను, కస్తూరిబా గాంధీ విద్యాలయాలు(కెజిబివి)ఏర్పాటు చేసి మెరుగైన విద్యను అందించాలని చెప్పారు.అదేవిధంగా వివిధ రాష్ట్రాలు పత్రిపాదించిన ప్రాజెక్టులపై కేంద్రానికి చెందిన కార్యదర్శులు ఆయా రాష్ట్రాల ఉన్నతాధికారులతో ప్రత్యేకంగా సమీక్షించి సకాలంలో వాటికి అనుమతులు ఇచ్చేలా కృషి చేయాలని మంజూరు చేసిన పనులను ప్రాధాన్యతలకు అనుగుణంగా సకాలంలో చేపట్టి పూర్తి చేయాలని కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హా అందరు సిఎస్ లను ఆదేశించారు. ఈవీడియో సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ మాట్లాడుతూ రాష్ట్రంలో వామపక్ష తీవ్రవాద ప్రభావిత 8జిల్లాల్లోని 397 గ్రామాల ప్రజలకు బ్యాంకింగ్ సేవలను అందించేందుకు చర్యలు చేపట్టామని వివరించారు.ఇందుకుగాను డ్వాక్రా సంఘాల మహిళలను కూడా బిజినెస్ కరస్పాండెంట్లు(బిసిలు)గా నియమించడం జరుగుతోందని తెలిపారు.ఈప్రాంతాల్లో విద్యా సౌకర్యాలను మెరుగుపర్చేందుకు 287 కస్తూరీభా గాంధీ విద్యాలయాలను నెలకొల్పడం జరిగిందని పేర్కొన్నారు.ఆయా ప్రాంతాల యువతలో నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఐటిఐలను ఇతర శిక్షణా సంస్థలను నెలకొల్పడం జరుగుతోందని వివరించారు.అదే విధంగా టెలికమ్యునికేషన్ వ్యవస్థ మెరుగుపర్చేందుకుగాను మొదటి దశ పనులు ఇప్పటికే పూర్తిచేయగా రెండవ దశ పనులు చేపట్టేందుకు కృషి జరుగుతోందని తెలిపారు.రహదారుల అభివృద్ధికి సంబంధించి ఇప్పటికే 127 పనులు మంజూరు కాగా మరో 324 పనులు ప్రతిపాదించామని వాటిని మంజూరు చేయాలని సిఎస్ విజ్ణప్తి చేశారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మూడు సిఎపిఎఫ్ బలగాలను కేటాయించాలని సిఎస్ దినేష్ కుమార్ కేబినెట్ కార్యదర్శి ప్రదీప్ కుమార్ సిన్హాకు విజ్ణప్తి చేశారు.ఈవీడియో సమావేశంలో ప్రత్యేక ప్రధాన కార్యదర్శి మన్ మోహన్ సింగ్,సాధారణ పరిపాలనశాఖ కార్యదర్శి ఎన్.శ్రీకాంత్,ఆర్ధికశాఖ ప్రత్యేక కార్యదర్శి కె.సత్యనారాయణ,రాష్ట్ర ఇంటిలిజెన్స్ బ్యూరో ఐజి శ్రీనివాసులు,గిరిజన సంక్షేమశాఖ సంచాలకులు జి.చంద్రుడు ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.

No comments:

Post a Comment