న్యూఢిల్లీ, జులై10, (way2newstv.in)
జమిలీ ఎన్నికలకు వైసీపీ అనుకూలం. ఆంధ్ర ప్రదేశ్ లో లోక్ సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరుగుతున్నాయని వైకాపాఎంపీ విజయ్ సాయి రెడ్డి అన్నారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడుతూ మళ్ళీ మళ్ళీ ఎన్నికలు జరగడం వల్ల అభిరుద్ది కుంటుపడుతోంది. ఒకవేళ మధ్యలో సభ రద్దయితే... మిగతా కాలానికి మాత్రమే ఎన్నికలు ఉంటాయని లా కమిషన్ రికమెండ్ చేస్తామని చెప్పింది. రాజ్యసభ డిప్యూటీ చైర్మన్ పదవికి బీజేపీ నిలబెట్టే అభ్యర్థికి మద్దతు ఇవ్వమని అయన అన్నారు. ఆంధ్ర ప్రయోజనాలను చంద్రబాబు తాకట్టుపెట్టారు. స్వప్రయోజనాల కోసం ఈ దగుల్బాజీ ముఖ్యమంత్రి ఎంతకైనా తెగిస్తారు. అలిపిరి ఘటన తర్వాత మళ్ళీ గెలుస్తామన్న భ్రమతో ముందస్తు ఎన్నికలకు వెళ్లారని అయన అన్నారు. లక్షలకోట్లు ఆర్జించిన చంద్రబాబు.విదేశాల్లో దాచుకుంటున్నారు. దోచుకున్న సొమ్మును దాచుకోవడానికే చంద్రబాబు సింగపూర్ వెళ్లారని ఆరోపించారు. టీటీడీ జె ఈ సింగపూర్ ఎందుకెళ్ళాడని అయన ప్రశ్నించారు.
జమిలీకి వైకాపా అనుకూలం
No comments:
Post a Comment