Breaking News

24/07/2018

ఇరాన్‌ అధ్యక్షుడి వ్యాఖ్యలఫై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం

వాషింగ్టన్‌ జూలై 24  (way2newstv.in)  
అమెరికా, ఇరాన్‌ మధ్య ఇలాంటి యుద్ధ వాతావరణ ఛాయలే కన్పిస్తున్నాయి. అమెరికా, ఇరాన్‌ దేశాధినేతల బహిరంగ హెచ్చరికలే ఇందుకు కారణం.2015లో ఇరాన్ అణు కార్యక్రమానికి సంబంధించి చేసుకున్న అంతర్జాతీయ ఒప్పందాన్ని ట్రంప్‌ వెనక్కి తీసుకున్న తరవాత నుంచి ఇరాన్‌ మీద యూఎస్‌ ఒత్తిడి పెంచుతోంది. దీంతో అమెరికాపై ఇరాన్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలోనే ఆ దేశ అధ్యక్షుడు హసన్‌ రౌహనీ.. నిన్న ట్రంప్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘మిస్టర్ ట్రంప్‌.. సింహం తోక పట్టుకొని ఆటలాడుకోవద్దు. అది చివరికి తీవ్ర ప్రమాదానికి కారణమవుతుంది. ఇరాన్‌తో శాంతి సంబంధాలు నెలకొల్పడం ప్రపంచ శాంతికి కారణమవుతుంది. అదే ఇరాన్‌తో యుద్ధం అన్ని యుద్ధాలకు తల్లిలాంటింది’ అంటూ ఆయన అమెరికాపై తీవ్రంగా మండిపడ్డారు.కాగా.. ఈ వ్యాఖ్యలకు ట్రంప్‌ కూడా దీటుగానే బదులిచ్చారు. ట్విటర్‌ వేదికగా రౌహనీపై నిప్పులు చెరిగారు. ‘రౌహనీ.. ఇంకోసారి అమెరికాను భయపెట్టాలని చూడకు. లేదంటే చరిత్రలో మీరెప్పుడూ చవిచూడని పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ హింసాత్మక ధోరణికి మేమెప్పుడూ మద్దుతు ఇవ్వబోం. జాగ్రత్త..!’ అంటూ ట్రంప్‌ బదులిచ్చారు. ఆ మధ్య అగ్రరాజ్యం అమెరికా, ఉత్తరకొరియా మధ్య పరిస్థితులు పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉండేవి. అవి.. యుద్ధానికి సై అంటే సై అంటూ ఇరు దేశాల అధ్యక్షుడు సవాల్‌ విసురుకునే స్థాయికి తీసుకెళ్లాయి. అయితే ఆ తర్వాత సింగపూర్‌ వేదికగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌ జోంగ్‌ ఉన్‌ల భేటీతో అంతా సద్దుమణిగింది.



 ఇరాన్‌ అధ్యక్షుడి వ్యాఖ్యలఫై ట్రంప్‌ తీవ్ర ఆగ్రహం

No comments:

Post a Comment