Breaking News

10/07/2018

క్రికెటర్ గా కనిపించనున్న ప్రియాంక

ముంబై, జూలై 10, (way2newstv.in)
క్రియేట్ చేసే కథల కంటే నిజ జీవిత కథలతో సినిమాలు రూపొందించేందుకు పలు భాషా దర్శకులు ఆసక్తి చూపుతున్న విషయం తెలిసిందే. ఇటీవలి కాలంలో క్రీడాకారుల జీవిత కథలతో సినిమాలు రూపొంది ప్రజాదరణ పొందాయి. సచిన్ టెండూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, అజహరుద్దీన్, మిల్కా సింగ్, మేరీ కోం తదితరుల జీవిత కథలతో సినిమాలు వచ్చాయి. ప్రస్తుతం పి.వి.సింధు, సైనా నెహ్వాల్ బయోపిక్‌లు విడుదలకు సిద్ధమవుతున్నాయి. ప్రముఖ హాకీ క్రీడాకారుడు సందీప్ సింగ్ జీవితకథతో ‘సూర్మ’ అనే సినిమా రాబోతోంది. తాజాగా మహిళా క్రికెట్ ఇండియా కెప్టెన్ మిథాలీరాజ్ బయోపిక్ కూడా సెట్స్‌పైకి వెళ్ళనుంది. ఈ విషయాన్ని మిథాలీరాజ్ వెల్లడించింది. వయాకామ్ 18 సంస్థ తన బయోపిక్ కోసం సంప్రదించారని, తాను కూడా ఓకే చెప్పానని మిథాలి అన్నారు. ప్రస్తుతం ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందట. తన కథతో తెరకెక్కే సినిమాలో ప్రియాంక చోప్రా నటిస్తే బాగుంటుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది మిథాలి.నా పాత్రకు ప్రియాంక చోప్రా కరెక్ట్‌గా సరిపోతుంది. మా ఇద్దరి వ్యక్తిత్వాలు కూడా ఒకేలా ఉంటాయి. అయితే ఇది నా అభిప్రాయం మాత్రమే. నా పాత్రలో ఎవరు నటిస్తారనే విషయంలో యూనిట్‌దే తుది నిర్ణయం. ఈ సినిమా ప్రారంభమవుతుంది. ఈ ఏడాది సెప్టెం బర్‌లో నా ఆటోబయోగ్రఫీ ని వి డుదల చేయబోతున్నాను’’ అని వివరించింది మిథాలీ రాజ్.



క్రికెటర్ గా కనిపించనున్న ప్రియాంక

No comments:

Post a Comment