Breaking News

10/07/2018

మళ్లీ రిస్క్ కు రెడీ అవుతున్న అర్జున్

హైద్రాబాద్, జూలై 10, (way2newstv.in) 
నా పేరు సూర్య తో బాగా దెబ్బ తిన్న అల్లు అర్జున్ మరో సినిమా మొదలు పెట్టడానికి మాత్రం భారీ గ్యాప్ తీసుకున్నాడు. ఈ రెండు నెలల గ్యాప్ లో అల్లు అర్జున్ టెంక్షన్స్ అన్ని పక్కన పెట్టి తన ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేస్తున్నాడు. అయినా తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి విషయాలేమి లీక్ కాకుండా జాగ్రత్తగా డీల్ చేస్తున్నాడు. అయితే మనం, ఇష్క్, 24, హలో సినిమాల దర్శకుడు విక్రమ్ కుమార్ తో అల్లు అర్జున్ నెక్స్ట్ ప్రాజెక్ట్ ఒకే అయ్యింది. కానీ అధికారికంగా ఇంకా ప్రకటించలేదు. ఈ లోపు త్రివిక్రమ్ డైరెక్షన్ లో అల్లు అర్జున్ మరో ప్రాజెక్ట్ గురించి ఆలోచనలో ఉన్నట్టుగా వార్తలొచ్చాయి. 



మళ్లీ రిస్క్ కు రెడీ అవుతున్న అర్జున్

విక్రమ్ కుమార్ మాత్రం బన్నీ మాస్ ఆడియన్స్ ని దృష్టిలో పెట్టుకుని స్క్రిప్ట్ ని తయారు చేస్తున్నందున ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కేందుకు ఇంత టైం పడుతుందని… ప్రస్తుతం విక్రమ్ కుమార్ స్క్రిప్ట్ ఫినిషింగ్ లో బిజీగా ఉన్నాడని అంటున్నారు. మరి అల్లు అర్జున్ నా పేరు సూర్య దర్శకుడిని బాగా నమ్మి చేతులు కాల్చుకున్నాడు. వక్కంతమ్ వంశీతో చేసినప్పుడే అల్లు అర్జున్ రిస్క్ చేశాడని అని అన్నారు. మళ్లీ ఇప్పుడు కూడా అదే టాక్ వినబడుతుంది. ఇష్క్, మనం సినిమాలతో కమర్షియల్ హిట్ కొట్టి… 24 ని, హలో సినిమాని ప్రేక్షకులు కన్విన్స్ అయ్యేలా చెయ్యలేక చేతులెత్తిసిన విక్రమ్ కుమార్ తో అల్లు అర్జున్ మరోసారి రిస్క్ చేస్తున్నాడని అంటున్నారు.మరి అల్లు అర్జున్ ని మాస్ హీరోగా చూడాలనుకునే అభిమానులకి ప్రేక్షకుల కి తగినట్టుగా విక్రమ్ కుమార్ తన కథని రాసుకుని తెరకెక్కిస్తే ఓకె. అందుకే అల్లు అర్జున్ కి సరైన కథతో విక్రమ్ సెట్స్ మీదకెళ్లాలి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు ఆర్జున్ – విక్రమ్ కుమార్ ల స్క్రిప్ట్ ను ఆల్రెడీ లాక్ చేసేశారని… ఈ సినిమా పూర్తిస్థాయిలో మాస్ ఆడియన్స్ కు కనెక్ట్ అయ్యేలా ఉంటుందనే టాక్ బయటికి వచ్చింది. నాగ అశోక్ కుమార్, నల్లమలుపు బుజ్జి నిర్మిస్తోన్న ఈ సినిమా త్వరలోనే పట్టాలెక్కబోతుంది.

No comments:

Post a Comment