Breaking News

30/06/2018

రైతు బీమాపై రాద్దాంతం వద్దు

నల్గోండ, జూన్ 30, (way2newstv.in)
సీఎం కెసీఆర్ ప్రతిష్టాత్మకంగా  చేపట్టిన  రైతు బీమా పథకాన్ని ప్రతి  ఒక్క రైతు  సద్వినియోగం చేసుకోవాలని  ఎంపీ , రైతు సమన్వయ సమితి  అద్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి పిలుపునిచ్చారు. 



రైతు బీమాపై రాద్దాంతం వద్దు

శుక్రవారం నాడు నల్లగొండలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడిన ఆయన  ఇప్పటి వరకు  రాష్ట్ర వ్యాప్తంగా  21  లక్షల  మంది రైతుల నుంచి బీమా   నామినీ పత్రాలను సేకరించినట్లు వెల్లడించారు.  మిగిలిన వారు కూడా పధకంలో భాగస్వాములు కావాలని అన్నారు. ప్రతి పక్ష పార్టీలు  అనవసర రాద్దాంతాలు   ఆరోపణలు మాని   బీమా పథకంలో రైతులు చేరేలాకృషి చేస్తే, రైతులకు మేలు చేసిన వారు అవుతారని  గుత్తా  అన్నారు.  గతంలోఎప్పుడు ఎక్కడా లేని విధంగా పిడుగు పాటుకు  చనిపోయే వారికి కూడా సీఎం కెసీఆర్ పెద్ద మనస్సుతో 5 లక్షల  ఎక్స్ గ్రేషియా అందించేందుకు  ఒప్పుకున్నారని తెలిపారు.  ఇక సీఎం కెసీఆర్  వ్యవసాయ రంగంలో తీసుకుంటున్న చర్యలు  దేశ వ్యాప్తంగా   సంచలనం సృష్టిస్తున్నాయని అన్నారు. కేంద్రంలో ప్రధాన మంత్రి మోది కూడా  వ్యవసాయం గురించే మాట్లాడుతున్నారని అన్నారు. కేంద్రం అమలు చేస్తున్న ఉపాధీ హామీ పధకాన్ని కూడా వ్యవసాయానికి  అనుసంధానం చేస్తే  రైతులకు మరింత మేలు కలుగుతుందని అన్నారు. త్వరలోనే ఇతర రాష్ట్రాల్లో  అన్ని  వ్యవసాయ సంఘాలు  కూడా   తెలంగాణాలో అమలు అవుతున్న రైతు సంక్షేమ   పథకాలనే  అమలు చేయాలని  ఆందోళనలు మెదలు పెట్టారు. ఇది తెలంగాణకు గర్వకారణమని  అన్నారు.

No comments:

Post a Comment