అమరావతి, జూన్ 30, (way2newstv.in)
తెలుగు దేశం పార్టీ ఎంపిలతో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శుక్రవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతిపక్షాల అడ్డంకులను అధిగమించి, వారి కుట్రలను భగ్నం చేయాలని ఆయన అన్నారు. ఇది చాలా కీలకమైన సమయమని, ఏమరపాటుగా ఉంటే నష్టం కలుగుతుందని ఆయన హెచ్చరించారు. రాబోయే రోజుల్లో మరింత కఠినంగా ఉండాలని, పవిత్ర యజ్ఞంలో చిత్తశుద్ధితో పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. పార్టీ ఎంపీలు ఢిల్లీ లో సరదా వ్యాఖ్యలు చేయడంపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. కడపలో ఉక్కు ఫ్యాక్టరీ కోసం ఒకవైపు ఎంపి రమేశ్ పోరాడుతుంటే ఈ తరహా వ్యాఖ్యలు చేయడమేమిటని ఆయన ప్రశ్నించారు. ఎవరుపడితే వారు, ఏదిపడితే అది మాట్లాడవద్దని చంద్రబాబు ఎంపిలను ఆదేశించారు. ఎంపిలు మురళీమోహన్, అవంతి తాము ఏసిన వ్యాఖ్యలను ఎడిట్ చేసి విడుదల అయినట్లు వివరణ ఇచ్చారు. 75 ఏళ్ల వయస్సులోనూ వారం రోజులు దీక్ష చేయగలనన్న వ్యాఖ్యలను కత్తిరించారని మురళీమోహన్ అన్నారు.
పార్టీ ఎంపీలతో సీఎం చంద్రబాబు టెలికాన్ఫరెన్స్
టిడిపి ఎంపిల ఉద్యమంపై ప్రజలు ఆశలు పెట్టుకున్నారని చంద్రబాబు అన్నారు. ఉద్యమంలో ఒకే మాట – ఒకే బాట ఉండాలని ఆయన అన్నారు. రాష్ట్రానికి హాని చేసే వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, కుట్రదారుల చేతుల్లో పావుల్లా మారవద్దని ఆయన హెచ్చరించారు.
No comments:
Post a Comment