Breaking News

30/01/2020

హై స్పీడ్ కారిడార్ లో హైద్రాబాద్

హైద్రాబాద్, జనవరి 30, (way2newstv.in)
రైల్వే శాఖ ఎంపిక చేసిన ఆరు సరికొత్త హై స్పీడ్ రైలు కారిడార్‌లలో హైదరాబాద్ సెక్షన్ కూడా చోటు దక్కించుకుంది. దేశవ్యాప్తంగా ఆరు రైల్వే సెక్షన్‌లను హైస్పీడ్, సెమీ హైస్పీడ్ కారిడార్‌లుగా రైల్వేశాఖ గుర్తించింది. ఈ విషయాన్ని రైల్వేబోర్డు ఛైర్మన్ వికె యాదవ్ బుధవారం ఇక్కడ తెలిపారు. ఈ బృహత్తర ప్రాజెక్టుకు సంబంధించి పూర్తి స్థాయి నివేదికను (డిపిఆర్) ఏడాదిలోగా పొందుపరుస్తారని వివరించారు. ఇప్పుడు ఏర్పాటు అయ్యే ఈ కొత్త కారిడార్లను ఇప్పటికే నిర్మాణంలో ఉన్న ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ మార్గానికి అనుసంధానిస్తారు. ఇప్పుడు ఎంపిక చేసిన హైస్పీడ్ రైలు మార్గాలలో ముంబై పుణే హైదరాబాద్ కారిడార్ (711 కిలోమీటర్లు), ఢిల్లీ నోయిడా ఆగ్రా లక్నో వారణాసి ( 856 కిమీలు), ఢిల్లీ జైపూర్ ఉదయ్‌పూర్ అహ్మదాబాద్ ( 886 కిమీలు), చెన్నై బెంగళూరు మైసూరు ( 435 కిమీలు), ఢిల్లీ చండీగఢ్ లూధియానా జలంధర్ అమృత్‌సర్ (459 కిమీలు) చోటుచేసుకున్నాయి. 
హై స్పీడ్ కారిడార్ లో హైద్రాబాద్

ఎంపిక చేసుకున్న మార్గాలలో స్థల లభ్యత, అనుసంధాన ప్రక్రియ, రద్దీ సామర్థం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని డిపిఆర్‌ను సిద్ధం చేస్తారని యాదవ్ వివరించారు. అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకుని హైస్పీడ్ లేదా పాక్షిక హైస్పీడ్ కారిడార్ల ఏర్పాటు జరుగుతుందని తెలిపారు.దేశపు తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు జపాన్ సాంకేతిక పరిజ్ఞానంతో అమలు అవుతోంది. ఈ ప్రాజెక్టు 2023 డిసెంబర్ నాటికి పూర్తి అవుతుందని రైల్వే బోర్డు ఛైర్మన్ వివరించారు. ప్రస్తుతం భూ సేకరణ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టుకు భూమి సేకరణ పనులు వచ్చే ఆరు నెలల్లో 90 శాతం వరకూ పూర్తవుతాయని తెలిపారు. హైస్పీడ్ కారిడార్‌లను ఏర్పాటు చేసేందుకు ఏర్పాటు అయిన హైస్పీడ్ కార్పొరేషన్ ఈ భూ సేకరణ సంబంధిత పనులను పర్యవేక్షిస్తుందని యాదవ్ తెలిపారు.తొలి హైస్పీడ్‌ కారిడార్‌ అయిన ముంబై - అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు ప్రాజెక్ట్‌‌ నిర్మాణాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న విషయం తెలిసిందే. 2023 డిసెంబర్‌ నాటికి ఈ ప్రాజెక్టు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి 6 నెలల్లో 90 శాతం భూసమీకరణ పూర్తవుతుందని వీకే యాదవ్ తెలిపారు. ఈ ప్రాజెక్టు కోసం మొత్తం 1,380 హెక్టర్లు అవసరం అవుతుందని వివరించారు.

No comments:

Post a Comment