Breaking News

06/01/2020

పార పట్టి...చెత్తను ఎత్తి...

పల్లె ప్రగతి లో స్ఫూర్తి రగిలించిన కలెక్టర్  కృష్ణ భాస్కర్
సిరిసిల్ల జనవరి 06 (way2newstv.in)
రెండో విడత పల్లె ప్రగతి కార్యక్రమం ఐదవ రోజైన సోమవారం జిల్లాలో ఉత్సాహంగా సాగింది. ఎల్లారెడ్డిపేట మండలం, బొప్పాపూర్, కోరుట్ల పేట, సింగారం గ్రామంలో నిర్వహించిన పల్లె ప్రగతి కార్యక్రమంలో కలెక్టర్ కృష్ణ భాస్కర్ పాల్గొన్నారు.  బోప్పాపూర్ గ్రామంలో కలెక్టర్ స్వయంగా పార పట్టి.... పిచ్చి మొక్కలను తొలగించడమే కాకుండా చెత్త ను ట్రాక్టర్లలో కి ఎత్తి ప్రజల్లో స్ఫూర్తి రగిలించారు. గ్రామంలో ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలోని వివేకానంద డిగ్రీ కాలేజీ విద్యార్థులు ఎన్ఎస్ఎస్ క్యాంపులో భాగంగా పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనడంతో గ్రామం మొత్తం సందడిగా మారింది.
పార పట్టి...చెత్తను ఎత్తి...

ఈ సందర్భంగా కలెక్టర్  కృష్ణభాస్కర్  మాట్లాడుతూ ప్రభుత్వం నిర్వహిస్తున్న పల్లె ప్రగతి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాలు అభివృద్ధి బాట పట్టాలని అన్నారు. పల్లె ప్రగతి కార్యక్రమాన్ని నిర్లక్ష్యం  చేసే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు . గ్రామాల్లో అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి ఉంచాలని అన్నారు. చేపట్టవలసిన పనులపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని అన్నారు. ప్రజా సమస్యలు, గ్రామ అభివృద్ధికి కావలసిన ప్రణాళికలు తయారు చేసి పనులు నిర్వహించాలని అన్నారు. పంచాయతీ కార్యదర్శులు అందుబాటులో ఉండాలని అన్నారు.
సింగారం సర్పంచ్ , సిబ్బందికి కలెక్టర్ అభినందన...
సింగారం గ్రామంలో పర్యటించిన కలెక్టర్  కృష్ణ భాస్కర్ గ్రామంలో రోడ్డు కు ఇరువైపులా ఉన్న ఎవెన్యు ప్లాంటేషన్, పారిశుధ్య నిర్వహణ బాగుందని గ్రామ సర్పంచ్ మరియు సిబ్బంది ని అభినందించారు. ముందు ముందు కూడా ఇదే స్ఫూర్తి ని కొనసాగించాలని కలెక్టర్ తెలిపారు.

No comments:

Post a Comment