Breaking News

06/01/2020

బీజేపీలోకి మంచు ఫ్యామిలీ

న్యూఢిల్లీ, జనవరి 6, (way2newstv.in)
సినీ నటుడు, వైఎస్సార్‌సీపీ నేత మంచు మోహన్‌బాబు ప్రధాని మోదీని కలిశారు. సోమవారం ఢిల్లీలో మోహన్‌బాబు.. కుమారుడు విష్ణు, కోడలు విరోనిక, కుమార్తె మంచు లక్ష్మిలు భేటీ అయ్యారు. దాదాపు 45 నిమిషాల పాటూ ఈ సమావేశం కొనసాగింది. ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. మోహన్‌బాబు సాయంత్రం బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్రమంత్రి అమిత్‌ షాతోనూ సమావేశంకానున్నారు. మోదీతో భేటీపై మంచు లక్ష్మి ట్వీట్ చేశారు. ప్రధానిని కలిశామని.. ఆయన విజన్‌ను దేశం మొత్తం క్లియర్‌గా వినింది అన్నారు.
బీజేపీలోకి మంచు ఫ్యామిలీ

మోహన్‌బాబు కుటుంబ సమేతంగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలవడం రాజకీయంగా ప్రాధాన్యం ఏర్పడింది. ఆయన బీజేపీలో చేరతారనే ప్రచారం జరుగుతోంది. ప్రధాని మోదీ కూడా బీజేపీలోకి రావాలని మోహన్‌బాబును ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారనే చర్చ నడుస్తోంది. కానీ ఆయన ఎలాంటి ప్రకటన చేయలేదు.మోహన్‌‌బాబు ఎన్నికలకు ముందు వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. ఆ పార్టీ అభ్యర్థుల తరపున రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేశారు. అలాగే మంచు విష్ణు కూడా చిత్తూరు జిల్లాలోని కొన్ని నియోజకవర్గాల్లో ప్రచారంలో పాల్గొన్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత ఆయన రాజకీయాలకు కాస్త దూరంగానే ఉంటున్నారు. ఇప్పుడు ఉన్నట్టుండి ప్రధాని మోదీని కలవడం ఆసక్తికరంగా మారింది.

No comments:

Post a Comment