నందమూరి కల్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ `ఎంత మంచివాడవురా`. 'శతమానం భవతి' చిత్రంతో జాతీయ పురస్కారాన్నిగెలుచుకున్న సతీష్ వేగేశ్న దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ తొలిసారిగా చిత్ర నిర్మాణ రంగంలోకి దిగి ఆదిత్యా మ్యూజిక్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ పతాకంపై ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
క్లీన్ `యు` సర్టిఫికేట్‌తో సెన్సార్ పూర్తి చేసుకున్న నందమూరి కల్యాణ్ రామ్, సతీశ్ వేగేశ్న `ఎంత మంచివాడవురా`
ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్‌ను పొందింది. సంక్రాంతి సందర్భంగా సినిమాను జనవరి 15న విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా ...దర్శకుడు సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ - ``ఈ సంక్రాంతి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మా `ఎంత మంచివాడవురా` సినిమా ప్రేక్షకుల ముంందుకు వస్తుంది. సినిమా సెన్సార్ పూర్తి చేసుకోవడమే కాదు.. సింగిల్ కట్ లేకుండా క్లీన్ యు సర్టిఫికేట్ వచ్చింది. హృదయానికి హత్తుకునే అందమైన ఎమోషన్స్‌తో సాగే కుటుంబ కథా చిత్రమిది`` అన్నారు.నటీనటులు: నందమూరి కల్యాణ్ రామ్, మెహరీన్, వి.కె.నరేశ్, సుహాసిని,శరత్‌బాబు,తనికెళ్ల భరణి, పవిత్రా లోకేశ్, రాజీవ్ కనకాల, వెన్నెల కిశోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను తదితరులు
No comments:
Post a Comment