బెంగళూరు జనవరి 3 (way2newstv.in)
బెంగళూరులో 107వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సదస్సును ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఈ నూతన సంవత్సరాన్ని సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు ఆవిష్కరణల కార్యక్రమంతో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. అది కూడా బెంగళూరు నగరంలో జరగడం ఆనందంగా ఉందన్నారు మోదీ. ఈ సంవత్సరంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అభివృద్ధికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆవిష్కరణల సూచికలో భారత్ యొక్క ర్యాంకు మెరుగుపడిందన్న మోదీ.. ఆ ర్యాంకు 52కు చేరిందన్నారు.
గ్రామీణాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యం: ప్రధాని మోదీ
గత 50 ఏళ్లతో పోల్చితే ఈ ఐదేండ్లలో తమ పథకాలు టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్స్‌ను సృష్టించాయని ప్రధాని తెలిపారు. ఈ విజయాలకు మన శాస్త్రవేత్తలను అభినందిస్తున్నానని చెప్పారు.గ్రామీణాభివృద్ధితోనే దేశాభివృద్ధి సాధ్యమని స్పష్టం చేశారు. నూతన సాంకేతికత పరిజ్ఞానం మరింత అవసరమని ఆయన చెప్పారు. కార్యక్రమాల విజయవంతానికి సరికొత్త సాంకేతికత అవసరమన్నారు. గత ఐదేళ్లలో గ్రామీణాభివృద్ధికి చాలా చర్యలు తీసుకున్నామని మోదీ తెలిపారు. అంతరిక్ష ప్రయోగాల్లో మన శాస్త్రవేత్తలు పురోగతి సాధిస్తున్నారని పేర్కొన్నారు. సమాచార, సాంకేతిక పరిజ్ఞానం సమర్థ వినియోగానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. దళారులతో ప్రమేయం లేకుండా రైతులు నేరుగా మార్కెట్‌లో విక్రయిస్తున్నారని మోదీ తెలిపారు.
No comments:
Post a Comment