Breaking News

03/01/2020

అట్టహాసంగా ఫ్లెమింగో ఫెస్టివల్

నెల్లూరు జనవరి 3 (way2newstv.in)
నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట దగ్గర్లోని నేలపట్టులో అట్టహాసంగా ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రారంభం అయింది. ఈ ఉత్సవాలలో  నెల్లూరు జిల్లా ఇన్-ఛార్జ్ మంత్రి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, నెల్లూరు జిల్లా మంత్రులు మేకపాటి గౌతమ్ రెడ్డి, అనిల్ కుమార్ యాదవ్, ఉదయగిరి ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, సూళ్లూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తదితరులు పాల్గోన్నారు. 
అట్టహాసంగా ఫ్లెమింగో ఫెస్టివల్

పక్షుల పండగ సందర్భంగా రంగురంగుల పక్షులు ఫోటోలను  మంత్రులు అవిష్కరించారు.  ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాల ప్రదర్శనతో పాటు వ్యవసాయ, అటవీ, ఉద్యాన, సాంకేతిక, పశు సంవర్ధక శాఖలు ఏర్పాటు చేసిన ప్రత్యేక స్టాల్స్ ను మంత్రులు సందర్శించారు.ఉత్సాహంగా సాగిన ఫ్లెమింగో ఫెస్టివల్ సందర్భంగా  కళాకారుల ప్రత్యేక సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేసారు.

No comments:

Post a Comment