విశాఖపట్నం జనవరి 29, (way2newstv.in)
ఏపీలో హాట్ టాపిక్ గా మారిన మూడు రాజధానుల అంశంపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. ఎవరు అడ్డొచ్చినా 3 రాజధానుల ప్రతిపాదన ఆగదని విజయసాయి రెడ్డి తేల్చి చెప్పారు. ఎంతమంది అడ్డుకున్నా విశాఖను ఎగ్జిక్యూటివ్ రాజధానిగా చేస్తామని స్పష్టం చేశారు. కొంతమంది విశాఖ రాజధాని కాకుండా అడ్డుకునేందుకు యత్నిస్తున్నారని, అది సాధ్యం కాదని విజయసాయి రెడ్డి అన్నారు.
మూడు రాజధానుల ప్రతిపాదన ఆగదు
కొత్త రాష్ట్రాన్ని హరితాంధ్రగా మార్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. రాష్ట్రంలో 25 కోట్ల మొక్కలు నాటడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు. చంద్రబాబు, సుజనా చౌదరి అమరావతిలో వేల ఎకరాలు కొన్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. అందుకే 3 రాజధానులను ఆ ఇద్దరు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు.
No comments:
Post a Comment