Breaking News

29/01/2020

బాసరలో వసంత పంచమి వేడుకలు

బాసర  జనవరి 29, (way2newstv.in)
నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో శ్రీ వసంత పంచమి వేడుకలు రెండవ రోజు అంగరంగవైభవంగా జరుగుతున్నాయి, సరస్వతి అమ్మవారిని దర్శించుకునేందు తెలంగాణ,ఆంధ్రప్రదేశ్,తమిళనాడు, మహారాష్ట్ర నుండి తరలివచ్చారు.పవిత్ర గోదావరి నదిలో భక్తులు పుణ్యస్నానాలు చేసి అమ్మవారి దర్శనానికి భక్తులు క్కులైన్ లో బారులు తీరారు. 
బాసరలో వసంత పంచమి వేడుకలు

సరస్వతి,మహా లక్ష్మీ,మహాకాళి  అమ్మవార్లకు వేద మంత్రోత్సరణ పూజలతో ఆలయ అర్చకులు, వేదపండితులు ముగ్గురు అమ్మవార్లకు అభిషేకం,అలంకరణ, అర్చన,నివేదిన,హారతి పూజ కార్యాక్రమలు ఘనంగా నిర్వహించారు.సుదూర ప్రాంతాలనుండి తరలి వచ్చిన భక్తులను అమ్మవారి సర్వదర్శనానికి రెండుగంటల సమయం పడుతుంది.అమ్మవారి సన్నిధిలో ఆలయ అర్చకులచే తల్లిదండ్రులు తమ చిన్నారులకు అక్షరాబ్యాసం, కుంకుమార్చన పూజలు చేశారు. భక్తులకు సౌకర్యార్థం క్యూలైన్ లో ఆలయ అధికారులు త్రాగునీరు,పాలు బిస్కెట్లు అందిస్తున్నారు,వివిధ స్వచ్ఛంద సేవా సమితి నిర్వాకులు భక్తులకు సేవలను అందిస్తున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

No comments:

Post a Comment