భువనేశ్వర్, జనవరి 20 (way2newstv.in)
ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఉద్యోగుల్లో వణుకుపుట్టిస్తున్నారు. అవినీతికి పాల్పడితే వెంటనే ప్రభుత్వం చర్యలకు దిగుతుండటం, వారి పదోన్నతులను నిలిపి వేస్తుండటంతో ఉన్నతోద్యోగుల నుంచి సాధారణ ఉద్యోగుల వరకూ జడిసిపోతున్నారు. నవీన్ పట్నాయక్ ఇటీవల జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ప్రధానంగా అవినీతిపైనే దృష్టి పెట్టారు. అవినీతి జరిగితే వెంటనే యాక్షన్ తీసుకోవాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.ఇప్పటి వరకూ ప్రభుత్వోద్యోగుల పదోన్నతి విషయంలోనూ అవినీతి కన్పించేది. చేతులు తడిపితేనే ఫైళ్లు కదిలేవి. దీంతో ఉద్యోగులు సయితం తమ పదోన్నతులు కోసం ప్రజల వద్ద చేయి చాచేవారు. అయితే ఐదోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలను స్సీకరించిన నవీన్ పట్నాయక్ ప్రధానంగా ఉద్యోగుల పదోన్నతులపై దృష్టిసారించారు.
నవీన్ ఉద్యోగులకు దడ పుట్టించేస్తున్నారు...
డిసెంబరు నెల నుంచి నవీన్ పట్నాయక్ దీనిపై సమీక్షలు చేయడంతో దాదాపు పన్నెండు వేల మంది ఉద్యోగులకు పదోన్నతి లభించడంతో ఆ వర్గం నుంచి కూడా నవీన్ పట్నాయక్ కు ఆమోదం లభించినట్లయింది.నవీన్ పట్నాయక్ వివిధ సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు వాటి అమలు విషయంలోనూ తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో కూడా అవినీతికి తావు ఉండకూడదని, లబ్దిదారుల ఎంపిక నుంచి వారికి పథకం చేరే వరకూ ఉద్యోగులు నిజాయితీతో పనిచేయాలని నవీన్ పట్నాయక్ పదే పదే వివిధ సమావేశాల్లోనూ, వీడియో, టెలికాన్ఫరెన్స్ లో కోరినా పెద్దగా ఫలితం లేకపోవడంతో ఉద్యోగుల పదోన్నతులపై దృష్టి సారించి అవినీతిని కొంత మేర తగ్గించగలిగారు.ఐదోసారి ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వెంటనే నవీన్ పట్నాయక్ 5టీ, మో సర్కార్ వంటి కార్యక్రమాలను ప్రారంభించారుు. 5 టీ విభాగాన్ని తన కార్యాలయంలోనే నవీన్ పట్నాయక్ ఏర్పాటు చేశారు. దీనికి నిజాయితీపరుడిగా పేరు గాంచిన ఐఏఎస్ అధికారి కార్తికేయ పాండ్యన్ కు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించారు. మో సర్కార్ లో మాత్రం వివిధ ప్రభుత్వ విభాగాల్లో పనితీరును పరిశీలించేందుకు నిఘాను ఏర్పాటు చేశారు. అవినీతి అధికారుల జాబితా ఎప్పటికప్పుడు నివేదికల రూపంలో నిఘా అధికారులు 5 టీ కి తెలియజేస్తారు. వెంటనే యాక్షన్ తీసుకుంటారు. సంబంధిత జిల్లా కలెక్టర్ తో నేరుగా నవీన్ పట్నాయక్ మాట్లాడుతుండటంతో చేయి చాపాలంటే ఉద్యోగులు వణికిపోతున్నారు.
No comments:
Post a Comment