Breaking News

22/01/2020

నరసరావుపేటలో బంద్ సంపూర్ణం

నరసరావుపేట జనవరి 22  (way2newstv.in)
మూడు రాజధానుల ఏర్పాటుకు సంబంధించి జరుగుతున్న నిరసనలలో భాగంగా నేడు నరసరావుపేటలో బంద్ సంపూర్ణంగా జరుగుతున్నది. అమరావతి పరిరక్షణ సమితి నరసరావుపేట జేఏసీ ఆధ్వర్యంలో స్వచ్ఛందంగా బంద్ కొనసాగుతున్నది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ డాక్టర్ చదలవాడ అరవింద బాబు మాట్లాడుతూ రైతులను అవమానపరిచే రీతిలో రాష్ట్రంలో పాలన సాగుతున్నదని అన్నారు.
నరసరావుపేటలో బంద్ సంపూర్ణం

ఒక్క రాజధాని అభివృద్ధి చేయడానికే డబ్బుల్లేవంటున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి మూడు రాజధానులు ఎలా కడతాడని ప్రశ్నించారు. మూడు రాజధానులకు రాష్ట్రంలోని 70 శాతం మంది ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారని ఆయన అన్నారు. జేఏసీ పిలుపు మేరకు బంద్ సంపూర్ణంగా జరుగుతున్నదని ఆయన తెలిపారు. బంద్  కు సహకరిస్తున్న వ్యాపారులకు అన్ని వర్గాల ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. బంద్ సందర్భంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేశారు.

No comments:

Post a Comment