Breaking News

22/01/2020

ఇస్రో నావిగేషన్‌ కు క్వాల్‌కమ్‌ చేయూత

బెంగళూరు జనవరి 22 (way2newstv.in)
భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందించనున్న శాటిలైట్‌ నావిగేషన్‌ సిస్టమ్‌ నావిక్‌కు సరిపోయే చిప్‌సెట్‌ల తయారీకి అమెరికాకు చెందిన సెమికండక్టర్‌, టెలీకమ్యూనికేషన్‌ సంస్థ క్వాల్‌కమ్‌ చేయూతనిస్తుంది.
ఇస్రో నావిగేషన్‌ కు క్వాల్‌కమ్‌ చేయూత

స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో తలపెట్టిన నావిక్‌ జీపీఎస్‌ ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్లకు తగిన చిప్‌సెట్‌లను క్వాల్‌కమ్‌ తయారుచేయనున్నట్లు ఇస్రో అధ్యక్షుడు డా.కె.శివన్‌ బెంగళూరులో తెలిపారు.భారత్‌తో పాటు సరిహద్దుల నుంచి 1,500 కిలోమీటర్ల పరిధిలోని దేశాలకు ఈ ఫోన్ల ద్వారా సమాచార వ్యవస్థ నావిగేషన్‌ సిస్టమ్‌ ను కొనసాగించే వీలుంది.

No comments:

Post a Comment