చెన్నై, జనవరి 8 (way2newstv.in)
సంక్రాంతి కానుకగా జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సూపర్ స్టార్ రజినీకాంత్ ‘దర్బార్’ మూవీకి మద్రాస్ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. దర్బార్ విడుదలపై హైకోర్ట్‌లో ఉన్న పిటిషన్‌పై కీలక ఉత్తర్వులు జారీ జారీచేసింది.సౌత్ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్‌లో శుభకరణ్ నిర్మించారు. రజినీ స్టామినాకు తగ్గట్టుగా ఈ చిత్రాన్ని ప్రపంచ వ్యాప్తంగా ఈనెల 9న సుమారు ఎనిమిది వేల థియేటర్స్‌లో భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఇక తమిళనాడు, ఆంధ్ర, తెలంగాణలలోనే కాకుండా విదేశాల్లో కూడా రజినీ సినిమాలకు మంచి క్రేజ్ ఉంది.
బకాయిల తర్వాతే సినిమా విడుదల
మలేషియాలో తమిళులు అధికంగా ఉండటంతో అక్కడ భారీ స్క్రీన్స్‌లో ‘దర్బార్’ విడుదలకు సన్నాహాలు జరుగుతున్నాయి. అయితే దర్బార్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్ అంతకు ముందు రజినీకాంత్ ‘2.0’ చిత్రాన్ని నిర్మించింది. కాగా ఈ చిత్రానికి సంబంధించి మలేషియా సంస్థకు రూ. 23 కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పాత బకాయిని చెల్లించకుండా దర్బార్ చిత్రాన్ని విడుదల చేస్తుండటంతో సదరు సంస్థ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.దీనిపై హైకోర్టు కీలక ఉత్తర్వులను జారీ చేసింది.. పాత బకాయిలను చెల్లించి.. ఈ సినిమా విడుదలకు 4.90 కోట్లను డిపాజిట్ చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. లేని పక్షంలో మలేషియాలో ‘దర్బార్’ సినిమా విడుదలకు అనుమతించబోమని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీంతో మలేషియాలో ‘దర్బార్’ రిలీజ్‌కి బ్రేక్‌లు పడటంతో ఫ్యాన్స్‌లో కలవరం మొదలైంది. కాగా.. లైకా ప్రొడక్షన్స్ సదరు సంస్థతో సంప్రదింపులు జరుపుతుందని.. విడుదలకు ఎలాంటి అడ్డంకులు ఉండబోవని తెలుస్తోంది
No comments:
Post a Comment