Breaking News

29/01/2020

కరోనా నమోదు కాలేదు

హైదరాబాద్  జనవరి 29, (way2newstv.in)
మనదేశంలో కరోనా పాజిటివ్ కేసు ఒక్కటి కూడా నమోదు కాలేదు.  చైనా నుంచి వచ్చిన వారికి అనుమానీతుల రక్త నమూనాలు పూణే పంపించామని రాష్ట్ర ఆరోగ్య శాఖా మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. బుధవారం అయన మీడియాతో మాట్లాడారు.  కొత్త వైరస్ తో కొంత ఆందోళన కలిగిస్తుంది.  స్వైన్ ఫ్లూ లక్షణాలే కలిగి ఉంటుంది కరోనా.  గాంధీ, ఫివర్, చెస్ట్ ఆస్పత్రిలో ఐసోలేటెడ్ వార్డులు ఏర్పాటు చేశామని అన్నారు.  హైదరాబాద్ లో కరోనా టెస్ట్ లు చేసేందుకు కేంద్రం అనుమతులు ఇచ్చే అవకాశం వుంది.  
కరోనా నమోదు కాలేదు

కరోనా అనుమానితులకు హైదరాబాద్ లో వంద బెడ్స్ సిద్ధంగా ఉంచాం.  కనీస జాగ్రత్తలు తీసుకోవాలి.  చేతులు ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.  ప్రజలు భయపడవద్దని అయన అన్నారు.  అధికారులతో మాట్లాడి నిర్దారణ చేసుకున్న తర్వాతనే కరోనా పై వార్తలు ఇవ్వాలని అయన సూచించారు.  ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో... కరోనా వైరస్ విస్తరించే అవకాశం లేదు.  మేడారం జాతరలో జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి సూచించారు.  మేడారం జాతరలో ప్రజలకు సమీపంలో ఆస్పత్రుల్లో హై అలర్ట్ గా ఉంచాం.  ఆరు మంది జిల్లా వైద్యాధికారులను సిద్ధంగా ఉంచాం.  13 మంది ఫుడ్ ఇన్స్పెక్టర్ లు మేడారం జాతరలో అందుబాటులో ఉంటారు. ఇప్పటివరకు 5 మంది పేషంట్ ల రక్త నమూనాలు తీసుకున్నామని అయన అన్నారు.  కరోనా లక్షణాలు ఉన్నట్లు తేలలేదని ఈటల అన్నారు.

No comments:

Post a Comment