తహసిల్దార్ వెంకటలక్ష్మి
తుగ్గలి జనవరి 29, (way2newstv.in)
తుగ్గలి మండల పరిధిలోని గల అర్హులందరికీ ప్రభుత్వ ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తామని తుగ్గలి తహసిల్దార్ వెంకటలక్ష్మి తెలియజేశారు. ఇళ్ల పట్టాలను ఉగాదికు అందరికీ పంపిణీ చేస్తున్నట్లు ఆమె తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని కడమకుంట్ల గ్రామంలో గల హౌస్ సైట్లను తాహసిల్దార్ పరిశీలించారు.
అర్హులందరికీ ఇళ్ల పట్టాలు పంపిణీ
కడమకుంట్ల లోని సర్వే నంబర్ 435/1,2 సర్వే నంబర్లలో గల 3.90 సెంట్ల విస్తీర్ణం గల భూమిని పరిశీలించారు. ఎన్ఆర్ఈజీఎస్ నిధుల ద్వారా భూములలో చెట్లు మరియు రాళ్లను తొలగించాలని ఏపీఓ రాజు నాయక్ కు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామ విఆర్వో రవి,వి విఆర్ఏ చౌడప్ప,టెక్నికల్ అసిస్టెంట్ ప్రదీప్ మరియు రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment