Breaking News

23/01/2020

పెద్ద రాష్ట్రాలపై కాంగ్రెస్ గురి

న్యూఢిల్లీ, జనవరి 23 (way2newstv.in)
పుదుచ్చేరి చిన్న రాష్ట్రం. కేంద్ర పాలిత ప్రాంతం. అలాంటి పుదుచ్చేరిలో డీఎంకే, కాంగ్రెస్ మధ్య తలెత్తిన విభేదాలు వచ్చే ఎన్నికల్లో చూపించనున్నాయి. పుదుచ్చేరిలో ప్రస్తుతం కాంగ్రెస్, డీఎంకే అధికారంలో ఉంది. కాంగ్రెస్ అధికారంలో ఉండటతో ఇక్కడ గత కొన్నేళ్లుగా లెఫ్ట్ నెంట్ గవర్నర్ కిరణ్ బేడీకి, ముఖ్యమంత్రి నారాయణస్వామికి పొసగడం లేదు. కాంగ్రెస్ అమలు పర్చాలనుకున్న పథకాలకు సయితం కిరణ్ బేడీ గండి కొడుతున్నారు. వచ్చే ఏడాది పుదుచ్చేరి ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 30 అసెంబ్లీ స్థానాలున్న పుదుచ్చేరిలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ 15 స్థానాల్లోనూ, డీఎంకే మూడు స్థానాల్లోనూ గెలవడంతో ప్రభుత్వం ఏర్పాటయింది. మ్యాజిక్ ఫిగర్ 16 కావడంతో కాంగ్రెస్, డీఎంకే కూటమిల ప్రభుత్వం ఇప్పటి వరకూ సజావుగానే సాగింది. 
పెద్ద రాష్ట్రాలపై కాంగ్రెస్ గురి

వచ్చే ఏడాది తమిళానాడుతో పాటు పుదుచ్చేరి ఎన్నికలు కూడా జరగనున్నాయి. పేరుకు పుదుచ్చేరి కాని, తమిళనాడు రాజకీయ ప్రభావం ఈ చిన్న రాష్ట్రంపై ఉంటుంది. డీఎంకే, కాంగ్రెస్ ల మధ్య తలెత్తిన విభేదాలు ఈ రాష్ట్రంపై పడే అవకాశాలున్నాయని తెలుస్తోంది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేస్తే ఇబ్బందులు తప్పవు. అలాగే డీఎంకేది కూడా అదే పరిస్థితి. అయితే స్టాలిన్ ఎక్కువ స్థానాలను కాంగ్రెస్ కు తమిళనాడులో కేటాయించాల్సి వస్తుందని భావించి ఇటీవల కాలంలో ఆ పార్టీని దూరంగా పెడుతున్నారు. ఈ సారి ఎలాగైనా అధికారంలోకి రావాలనుకుంటున్న స్టాలిన్ కాంగ్రెస్ కు ఎక్కువ స్థానాలను కేటాయిస్తే గెలుపు కష్టమవుతుందని భావిస్తున్నారు.దీంతో పక్క రాష్ట్రమైన పుదుచ్చేరిలో ఈ ప్రభావం పడనుంది. ఇప్పటికే పుదుచ్చేరి డీఎంకే నేతలు తాము ఒంటరిగా పోటీ చేస్తామని ప్రకటించారు. రెండు దశాబ్దాల నుంచి డీఎంకే పుదుచ్చేరిలో అధికారంలోకి రాలేదన్నది వారి వాదన. 1996లో పుదుచ్చేరిలో డీఎంకే ప్రభుత్వం ఏర్పాటయింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలో ఉంటూ వస్తుంది. తాజా విభేదాల నేపథ్యంలో ఈసారి పుదుచ్చేరిలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. అయితే చివరి నిమిషంలోనైనా కాంగ్రెస్ డీఎంకేతో సర్దుబాటు చేసుకునే అవకాశాలు మాత్రం లేకపోలేదు. ఇప్పటికే రెండు పార్టీల మధ్య రాజీ చర్చలు జరిగాయి.

No comments:

Post a Comment