Breaking News

23/01/2020

కేంద్రం వ్యూహాంపై సర్వత్రా ఆసక్తి

న్యూఢిల్లీ, జనవరి 23 (way2newstv.in)
ఒకే ఒక్క విషయం ఇపుడు కేంద్రంలోని బీజేపీకి, ఏపీలోని వైసీపీకి మధ్య ఎలాంటి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయన్నది తేల్చబోతోంది. ఇప్పటివరకూ వైసీపీకి, బీజేపీకి ఎడం ఉందని టీడీపీ అనుకూల మీడియా రాసిన రాతలే తప్ప పెద్దగా ఆధారాలు మాత్రం లేవు. ఇపుడు జగన్ మూడు రాజధానుల పేరిట కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దాంతో దీని మీద కేంద్ర వైఖరి ఏంటన్నది తేలనుంది. మరి దీన్ని సీరియస్ గా పట్టించుకునే ఓపిక, తీరిక, ఆసక్తి కేంద్రానికి ఉన్నాయా అన్నదే ఇక్కడ పాయింట్.రాజధానులు ఎన్ని ఉండాలి? ఎలా ఉండాలి? ఎక్కడ ఉండాలి అన్నది పూర్తిగా రాజ్యాంగ పరిధిలోని అంశమని నిపుణులు చెబుతున్నారు. రాజధానులు ఎన్ని పెట్టుకున్నా ఆ నిర్వహణ భారం అంతా చూసుకోవాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే. 
కేంద్రం వ్యూహాంపై సర్వత్రా ఆసక్తి

దానికి కేంద్రం చిల్లి గవ్వ కూడా ఇవ్వదు. అందువల్ల స్తోమత చూసుకుని రాజధానులు ఎన్ని అయినా పెట్టుకోవచ్చు. కేంద్రానికి మాత్రం ఇది మా ప్రధాన రాజధాని ప్రాంతం అని ఒక సమాచారం మాత్రమే రాష్ట్రం నుంచి పంపాల్సి ఉంటుంది. దాన్ని కేంద్రం నోటిఫై చేసి జాతీయ మ్యాపులో పెడుతుంది. రాజ్యాంగ నిపుణులు చెప్పే విషయం ఇది.ఇక రాజకీయ పార్టీలు, నేతలు చెప్పే కబుర్లకు అంతూ పొంతూ ఉండదు, పైగా తలపండిన బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణతో పాటు, కొత్త పూజారి పవన్ కళ్యాణ్ వరకూ కేంద్రం చూస్తూ ఊరుకోదు అంటున్నారు. కేంద్రం జోక్యం చేసుకోవాలి అని టీడీపీ అధినేత చంద్రబాబు అంటున్నారు. మరో వైపు ఇది రాష్ట్రాల పరిధిలోని అంశమమని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అంటున్నారు. ఇలా ఎవరి అభిప్రాయాలు వారు చెబుతూ రాజకీయం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక మతలబు ఉంది. అదేంటి అంటే కేంద్రం జోక్యం చేసుకోవచ్చూ, చేసుకోకపోవచ్చూ, దానికి కారణం ఏపీలో ఉన్న ప్రత్యేక పరిస్థితులు.ఏపీ విభజ‌న కోరుకున్నది కాదు, పైగా రాజధాని అన్నది గుర్తించకుండా విడదీసిన రాష్ట్రం కూడా ఇదే కావడం విశేషం. ఇక రాజధానికి కేంద్ర సాయం అందించాలని విభజన చట్టంలో పేర్కొన్నారు. దానికి కేంద్రం కూడా 2,500 కోట్ల వరకూ ఇచ్చింది. దాంతో కేంద్రానికి జోక్యం చేసుకునే అవకాశం ఉంటుందని ఒక వాదన ఉంది. అదే వాదనలో మరో వైపు చూసుకుంటే నిధులు మరింతగా ఎక్కడ ఇవ్వాల్సివస్తుందోనని కేంద్రం సైతం చూసీ చూడనట్లుగా పోతుందని కూడా అంటున్నారునిజానికి కేంద్రం ఏపీకి విభజన చట్టం ప్రకారం పెద్దగా నిధులు ఇంతవరకూ ఇచ్చింది లేదు, ఇపుడు అనవసరంగా పూసుకుంటే వైసీపీ సర్కార్ నుంచి కూడా నిధులు ఇమ్మని డిమాండ్ వస్తుంది. దాంతో తెలివిగా కేంద్రం తప్పుకుంటుందని అంటున్నారు. అదే సమయంలో రాజకీయంగా వైసీపీని మరింతగా ఇరుకున పెట్టాలంటే ఇతర సాయం కింద నిధులను కూడా ఇవ్వకుండా మోకాలడ్డుతుందని ప్రచారం సాగుతోంది. మొత్తానికి కేంద్రం పేచీ అయితే పెట్టవచ్చు కానీ అది బయటకు తెలియకుండా తొడ పాశంలా పెడుతుందని, ఆ నొప్పితో వైసీపీ సర్కార్ రాజకీయ, ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటుందని ఢిల్లీ వర్గాల భోగట్టా.

No comments:

Post a Comment