Breaking News

09/01/2020

పర్యాటకానికి భారీగా నిధుల కొరత

హైద్రాబాద్, జనవరి 9, (way2newstv.in)
తెలంగాణలో ఏటికేడు పర్యాటకులు పెరుగుతున్నా అందుకు తగ్గట్టుగా మౌళిక సదుపాయాలను కల్పించడంలో సర్కార్‌ విఫలమయింది. ప్రభుత్వం కేటాయిస్తున్న నిధులు ఉద్యోగుల జీతభత్యాలకే సరిపోతుండడగా అభివృద్ధి పనులు ముందుకు సాగట్లేదు. టూరిజం మంత్రిగా వి.శ్రీనివాస్‌గౌడ్‌ బాధ్యతలు చేపట్టిన తర్వాత కాళేశ్వరం, సోమశీల ప్రాంతాలను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేద్దామని చెప్పినా, ప్రభుత్వం నుంచి ఆశించిన నిధులు అందలేదు. వాస్తవంగా దక్షణాది రాష్ట్రాలతో పోలిస్తే పర్యాటక రంగానికి తెలంగాణ వాటా స్వల్పంగా ఉంది. 2018-19 ఆర్థిక ఏడాదికిగాను కర్ణాటక ప్రభుత్వ వాటా రూ. 170కోట్లు కాగా, తమిళనాడు ప్రభుత్వం టూరిజానికి రూ. 173కోట్లు కేటాయించగా, రాష్ట్రం మాత్రం కేవలం రూ.29కోట్లు మాత్రమే ఇచ్చింది. 2019-20 ఏడాదికి గాను రూ. 38.58 కోట్లే మంజూరు చేసింది. టూరిజం శాఖలో దాదాపు 400 మంది కాంట్రాక్ట్‌, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు పనిచేస్తున్నారు. 
పర్యాటకానికి భారీగా నిధుల కొరత

వారికి చెల్లించాల్సిన జీతాలు నెలల తరబడి పెండింగ్‌లో ఉంటున్నాయి. రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాల గురించి ప్రజలకు వివరించేందుకు అవసరమైన కరపత్రాలు ముద్రించేందుకు కూడా ఆశాఖ వద్ద సొమ్ములు లేని దుస్థితి నెలకొంది.మరోవైపు నిధుల కోరత కారణంగా తెలంగాణ టూరిజం శాఖ ఆధ్వర్యంలో నడిచే బస్సులు ఒక్కొక్కటి మూలన పడుతున్నాయి. ఇదే సమయంలో హరితప్లాజా హోటళ్లు సైతం అధికారుల నిర్వహణ లోపం, అవినీతి మూలంగా క్రమేణా ప్రైవేటు పరం అవుతున్నాయి. పర్యాటకశాఖ వద్ద వోల్వో, ఏసీ, గరుడ, హైటెక్‌, ఇన్నోవా మొదలగు కేటగిరీలకు చెందిన మొత్తం 50 బస్సులున్నాయి. ఇందులో సగం వాహనాలు కాలం చెల్లినవి కావడంతో గ్యారేజీలకే పరిమితమవుతున్నాయి. ఇక టీటీడీసీ వద్ద రాష్ట్ర వ్యాప్తంగా 55 హరిత హౌటళ్లుఉండగా, గడిచిన ఐదేళ్ళలో రాష్ట్ర వ్యాప్తంగా 21 హరిత హౌటళ్లను ప్రయివేటుకు అప్పగించారు. ఇదిలావుంటే రాష్ట్రంలో మెజార్టీ జిల్లాలకు టూరిజం శాఖ అధికారులు లేరు. వరంగల్‌, హైదరాబాద్‌, అదిలాబాద్‌, ఖమ్మం, కరీంనగర్‌ వంటి పెద్ద జిల్లాల్లో పేరుకే టూరిజం అన్నట్లుగా తయారైంది. జిల్లా పౌరసంబంధాలు, సహకార, అటవీ, పంచాయితి శాఖల అధికారులు ఇన్‌చార్జీలుగా కొనసాగుతున్న పరిస్థితి నెలకొంది. దీంతో తమశాఖ పరిధిలో ఉండే పనులతో తీరికలేక సతమవుతున్న అధికారులు పర్యాటక రంగం గురించి పట్టించుకోవడం లేదనే వాదనలు వినిపిస్తున్నాయి.

No comments:

Post a Comment