Breaking News

09/01/2020

గందరగోళంగా వార్డుల విభజన

నిజామాబాద్, జనవరి 9, (way2newstv.in)
నిజామాబాద్‌ మున్సిపల్ ఎన్నికలపై ప్రజాప్రతినిధులతో పాటు ఓటర్లు ఆందోళన చెందుతున్నారు. ఓట్లు గల్లంతుకావడంపై స్థానిక ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తుంటే... వార్డుల విభజన గందర గోళంగా ఉందని స్థానిక నేతలు ఆందోళన చెందుతున్నారు. నిజామాబాద్‌ జిల్లాలో మున్సిపల్ ఎన్నికల హీట్‌ మొదలైంది. నిజామాబాద్‌ నగర పాలక సంస్థ పరిధిలో మొత్తం 60 డివిజన్లకు ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపద్యంలో నిజామాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 3లక్షలకుపై చిలుకు ఓటర్లు ఉన్నట్లు మున్సిపల్ అధికారులు జాబితాను కూడా విడుదల చేశారు. మున్సిపల్ అధికారులు విడుదల చేసిన ఓటరు జాబితాపై ప్రజల నుంచి వ్యతిరేఖత వస్తుంది. చాల మంది ఓట్లు గల్లంతయ్యాయని, స్థానికంగా లేనివారి ఓట్లు కూడా ఈ జాబితాలో చేర్చారని ఆరోపిస్తున్నారు. 
 గందరగోళంగా వార్డుల విభజన

చనిపోయిన వారి ఓట్లను తొలగించకుండానే ఓటరు జాబితాను సిద్దం చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని అలకాపురికాలనీలో సుమారు 250మంది ఓటరు జాబితాలో తమ పేర్లు గల్లంతయ్యాయని నగర పాలక సంస్థ ముందు ధర్నా కూడా చేసారు.ఈ దఫా వార్డులు కూడా మారడంతో నేతలు నిరాశలో మునిగిపోయారు. ఓట్లు గల్లంతు కావడంపై స్థానిక ప్రజాప్రతినిధులు కూడా అసంతృప్తితోనే ఉన్నారు. గతంలో 50డివిజన్లు ఉన్న నగర పాలక సంస్థ ఇప్పుడు 60డివిజన్లు కావడంతో... తాము చేసిన అభివృద్ధి మొత్తం మొదటికి వచ్చిందని ఆవేదన చెందుతున్నారు. ఇక మున్సిపల్‌ ఎన్నికల హడావిడి మొదలు కావడంతో జిల్లాలో సమవేశాలు నిర్వహిస్తున్నారు.  మరోవైపు రాజకీయ పార్టీల్లో అభ్యర్థుల ఎంపిక వ్యవహారం కాకరేపుతోంది. బల్దియా బరిలో నిలిచేందుకు అత్యధికులు ఆసక్తి చూపుతుండడంతో అభ్యర్థుల ఎంపిక సవాల్‌గా మారింది. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన సీనియర్‌ నేతలతో పాటు ఇటీవలే పార్టీలో చేరిన నేతలు కూడా కౌన్సిలర్‌ పదవులకు పోటీచేసేందుకు ఉత్సాహం చూపుతుండడంతో పోటీ తీవ్రమయ్యే పరిస్థితి నెలకొంది. నేతల హడావిడితో జిల్లాలో పొలిటికల్ హీట్ పెరిగింది. అన్ని పార్టీలు గెలుపుపై ధీమాగా ఉన్నా ఓటరు నాడి ఎలా ఉంటుందన్నది ఆసక్తిగా మారింది. అన్ని రాజకీయ పార్టీల్లో నేతల మధ్య విభేదాలు రాజ్యమేలుతున్నాయి. అది పార్లమెంట్‌ ఎన్నికల్లోనూ ప్రతిఫలించింది. పరిషత్‌ పోరులోనూ క్రాస్ ఓటింగ్‌ ప్రధాన పార్టీలను దెబ్బతీసింది. మున్సిపల్‌ ఎన్నికల్లో అలాంటి పరిస్థితి లేకుండా జాగ్రత్తపడుతున్నాయి పార్టీలు. నేతల మధ్య సమన్వయం, సఖ్యత ఎలా ఉంటాయో చూడాల్సిందేమరి.

No comments:

Post a Comment