క్రాఫ్ట్ కటింగ్ ద్వారా 6.8 క్వింటాలు శెనిగ దిగుబడి
మంత్రాలయం జనవరి 21 (way2newstv.in)
రబీ సీజన్లో పంటలు వేసుకున్న రైతులందరూ పంట నమోదు చేసుకోవాలని వ్యవసాయ శాఖ అధికారి శివశంకర్ పేర్కొన్నారు. మంగళవారం మండల పరిధిలోని రచ్చమర్రి గ్రామంలో శనగ పంటలు వేసుకున్న మహిళా రైతు పుల్లమ్మ పొలాన్ని పరిశీలించారు. క్రాప్ కటింగ్ చేయడం ద్వారా శనిగలు ఎకరాకు 6.8 క్వింటాలు దిగుబడి వచ్చినట్లు పేర్కొన్నారు. అలాగే మంత్రాలయం మండల పరిధిలోని అన్ని గ్రామాలలో దాదాపుగా నాలుగు వందల యాభై ఎకరాల శనిగ పంటలు వేసినట్టు తెలిపారు.
రైతులందరూ పంట నమోదు చేసుకోండి
రబీ సీజన్లో పంటలు వేసుకున్న మండల పరిధిలోని రైతులందరూ పంట నమోదు చేసుకోవాలని సూచించారు. నమోదు చేసుకోవడం వల్ల పంట దిగుబడి వచ్చిన తర్వాత ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పిస్తుందని తెలిపారు. నమోదు చేసుకోలేకపోతే రైతులకు గిట్టుబాటు ధరకు అర్హులు కారని, అందుకే రైతులు అందరూ నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సిబ్బంది రైతులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment