బిజెపి రామకృష్ణ
కౌతాళం జనవరి 21 (way2newstv.in)
కౌతాళం మండల పరిధిలో వెలసిన క్షేత్రం ఉరుకుంద శ్రీ నరసింహ స్వామి పుణ్యక్షేత్రం నరసింహ స్వామి సన్నిధిలో ముడుపులు తీసుకున్నట్లు నిరూపిస్తే మా భారతీయ జనతా పార్టీ నుంచి శాశ్వతంగా తప్పుకుంటామని మీ అవినీతి పై ఆరోపణలు నిజమైతే మీరు పార్టీ నుంచి తపుకుంటారా అని కిషన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ఘాటుగా పాత్రికేయులు సమావేశంలో ప్రశ్నించారు. మంగళవారం భారతీయ జనతా పార్టీ కార్యాలయం నందు పాత్రికేయుల సమావేశంలో బిజెపి కిషన్ మోర్చాజిల్లా అధ్యక్షులు రామకృష్ణ మాట్లాడుతూ
ముడుపులు తీసుకున్నట్టు నిరూపిస్తే మా పార్టీ నుంచి తప్పుకుంటాం
మాజీ సర్పంచ్ అవతారం మా నాయకుని విమర్శించే స్థాయి నైతిక విలువలు మీకు లేవు అని నాయకుడు గౌరవనీయులైన పెద్దలు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు హై కోర్ట్ సీనియర్ అడ్వకేట్ బి. పురుషోత్తం రెడ్డి మొన్న జరిగిన విలేకర్ల సమావేశంలో శ్రీ ఉరుకుంద ఈరన్న దేవస్థానం ప్రజల డబ్బు లు ప్రజల సొమ్మును కాజేశారని తలనీలాలు టెండర్లులో ఒక కోటి ముప్పేలక్షలు సకాలంలో బకాయిలు చెల్లించకపోవడంతో ఈ శ్రీఉరుకుంద ఈరన్న దేవస్థానం వారు పలుమార్లు హెచ్చరించిన ఈ టెండర్ వ్యక్తి నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తో దేవస్థానం వారు కోర్ట్ లో కేసు ఫైల్ చేశారు. సెక్షన్ 577,578/2018 కోర్ట్ లో కేసు ఫైల్ చేయడం జరిగినది. ఇది ఉరుకుంద ఈరన్న ట్రస్ట్ బోర్డు చైర్మన్ అవినీతి చేశారంటూ చెప్పడం జరిగినది మరియు మీరు పదవి కాలం చేసినటువంటి అవినీతికి తగినటువంటి ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. త్వరలో ఆధారాలు అన్ని విలేకరుల సమావేశం లో బయటపెడ్తాము అని అవేశాన్ని వ్యక్తం చేశారు. , 20/జనవరి/2020 తేదీన మీరు చేసినటువంటి అవినీతి ఇంత క్లియర్ గా చెప్పగా వ్యాపారంలో నష్టపోయే మంటూ వ్యాపారానికి టెండర్ కి ఈ రెండిటికీ మధ్య తేడా తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా, టెండర్లు పాడాలంటే అందుకు నియమ నిబంధనలు ఉంటాయి,నియమ నిబంధనలకు కట్టుబడి ఉండే ఆ టెండర్లు దక్కించుకున్న మాజీ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ దేశాయి కృష్ణ గారు ఆ టెండర్లు దక్కించుకున్నప్పటి నుంచి ఇప్పటివరకు కట్టలేదు కాబట్టి ఇంత విడమర్చి చెప్పినా మీరు దీని నుండి తప్పించుకోవడానికి మీ దళం బుకాయింపులకు, భజనలు చేస్తున్నారు మేము ప్రశ్నిచిన దానికి మీ దగ్గర సమాధానం లేక భారతీయ జనతాపార్టీ నాయకులు పై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. దేవస్థానంలో ముడుపులు ముట్టాయని చెప్పడం సరైన పద్ధతి కాదు నిజంగా భారతీయ జనతా పార్టీ నాయకులు పై మీ దగ్గర ఆధారాలు ఉంటే విలేకర్ల సమావేశంలో అందరూ మధ్యన సభా ముఖంగా చర్చకు మేము సిద్ధంగా ఉన్నాం భారతీయ జనతాపార్టీ నాయకులు తప్పు చేసినట్టు రుజువు అయితే బిజెపి మండల శాఖ నుంచితప్పుకోవడానికి సిద్ధంగా ఉన్నాం మరి మాజీ సర్పంచ్ ఉరుకుంద ఈరన్నట్రస్ట్ బోర్డ్ చైర్మన్ దేశాయ్ కృష్ణ తప్పు చేసినట్లు రుజువు చేస్తే మీ మండల నాయకత్వం నుంచి తప్పుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా సిద్ధంగా ఉంటే బహిరంగంగా చర్చించడానికి మీరు ఎక్కడ చెప్పిన అక్కడకు మేము వాచ్చేందుకు మేం సిద్ధంగా ఉన్నామని బిజెపి మండల అధ్యక్షులు వెంకన్న తెలిపారు ఈ సమావేశం లో మండల నాయకులు రామచంద్ర, నరేంద్ర ,నబిసాబ్, తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment