Breaking News

09/01/2020

గెలుపే లక్ష్యంగా ప్రచారం

నల్గొండ, జనవరి 9, (way2newstv.in)
హుజూర్ నగర్ ఉపఎన్నికలో ఘనవిజయం సాధించిన అధికార టీఆర్ఎస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో సైతం అదేజోరు కొనసాగించేదుకు సమాయత్తం అవుతుంది. ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటిచండానకి ముందే ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాలిటీ ఎన్నికల సన్నాహాక సమావేశం నిర్వహిస్తూ దూకుడును ప్రదర్శిస్తుంది. విపక్షాల కంటే పుర ఎన్నికల సమరాన్ని ప్రారంభించిన అధికార పార్టీ అన్ని చైర్మన్ స్దానాలను గెలుచుకునే విధంగా వ్యూహాత్మకంగా దూసుకెళ్తుంది.   ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని 18 మున్సిపాలిటిలలో పాగా వేసేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుంది. 
 గెలుపే లక్ష్యంగా ప్రచారం

ఇప్పటికే మున్సిపాలిటిలలో సన్నాహాక సమావేశాలు విజయవంతంగా పూర్తి చేసిన టీఆర్ఎస్ అభ్యర్దుల ఎంపిక పై ద్రుష్టిసారించింది. మున్సిపల్ ఎన్నికల నేపధ్యంలో ముందునుంచి దూరద్రుష్టితో ఉన్న అధికార పార్టీ అభ్యర్దులు ఓటరు లిస్టుపై జాగ్రత్తగా వ్యహారించారు.. అనుకూల ఓటర్ల ఓట్లు గల్లంతు కాకుండా, తమ అనుకూల వర్గాలను తమ వార్డుల్లో ఓటరుగా చేర్చుకునేందుకు వ్యూహాత్మకంగా వ్యహారించారు. మరోవైపు వార్డుల పునర్వీభజనపై కూడా అధికారపార్టీ ఆశావాహులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఎన్నికల ముందు జరగాల్సీన అన్ని దశల్లో అధికార పార్టీ జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వ్యవహారించి విజయం సాధించారు. ఇక ఎన్నికల కమీషన్ షెడ్యూల్ ప్రకటించడంతో అధికార పార్టీలో మున్సిపల్‌ ఎన్నికల రాజకీయం వేడెక్కింది. వివిధ పార్టీల నుంచి ఇప్పటికే టీఆర్‌ఎస్‌లో చేరిన ద్వితీయ శ్రేణి నాయకులు కౌన్సిలర్,  చైర్మన్‌ స్థానాల్లో బరిలోకి దిగేందుకు నువ్వా నేనా అనే విధంగా టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. విపక్ష పార్టీల కంటే కేవలం అధికార పార్టీలోనే వివిధ మున్సిపాలిటీల్లో ఒక్కో వార్డునుంచి పోటీచేసేందుకు ఇద్దరు ముగ్గురు సిద్ధపడుతున్నారు. ఇందులో భాగంగా ఎలాగైనా టికెట్లు దక్కించుకునేందుకు పార్టీలోని అగ్రనాయకుల వద్దకు తమ రాయబారాలు సాగిస్తున్నారు. ఫలితంగా టీఆర్‌ఎస్‌ పార్టీలో పోటాపోటీ నెలకొంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీలో మున్సిపల్‌ ఎన్నికల రాజకీయం రక్తి కడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ మున్సిపాలిటీల వారీగా కేడర్‌ను ఎన్నికలకు సిద్ధం చేసేందుకు సన్నాహక సమావేశాలు నిర్వహిస్తోంది. అధికార పార్టీలో ఒక్కో వార్డులో కనీసం ఇద్దరు నుంచి ముగ్గురు టికెట్ల కోసం పోటీ పడుతున్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ అధికారంలో ఉండడంతో ఆ పార్టీ టికెట్లకు యమ గిరాకీ ఏర్పడింది. ఉమ్మడి జిల్లాలోని 18 మున్సిపాలిటీల్లోనూ ఇదే పోటీ పరిస్థితి కనిపిస్తోంది. 18 మున్సిపాలిటీలలో గులాభీ ఝండా ఎగరవేయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తుండటంతో ఉమ్మడి నల్లగొండ జిల్లా మున్సిపల్ ఎన్నికల సమరం మరింత రసవత్తరంగా మారింది.

No comments:

Post a Comment