విజయవాడ, జనవరి 9 (way2newstv.in)
చంద్రబాబు రాజకీయం ముందు ఎవరైనా బలాదూర్ అని అందుకే అంటారు. పార్టీని పెట్టి పెంచి పెద్ద చేసిన అన్న నందమూరిని దించేసినపుడు కూడా తన వైపు ఇసుమంత వ్యతిరేకత కూడా రాకుండా జాగ్రత్త పడిన గండర గండడు చంద్రబాబు. అటువంటి చంద్రబాబు ఇపుడు వైసీపీ సర్కార్ ని మూడు చెరువుల నీళ్ళు తాగించేస్తున్నారు. తడబాట్లు, పొరపాట్లు అలవాటు గా చేసుకున్న వైసీపీ సర్కార్ చాలా సులువుగా చంద్రబాబుకు దొరికేస్తోంది. దాంతో ఏదో జరిగిపోతోందన్న భ్రమలను, భ్రాంతులను చంద్రబాబు జనంలోకి తీసుకెళ్ళిపోతున్నారు. అధికారం చేతిలో ఉంది కాబట్టి జనంలో ఉన్న వ్యతిరేకత తెలియడం లేదు కానీ జగన్ మంత్రుల బాధ్యతారహితమైన వైఖరి, అనుభవ రాహిత్యం గురించి ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే మరినిజానికి ఏపీకి మూడు రాజధానుల అవసరం ఉందా, ఉంటే అవి ఎలా ఉండాలి.
జగన్ కు భారంగా మారిన మంత్రులు
వాటి వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటి, అభివృధ్ధి ఎలా సాగుతుంది. ఇవి కదా అధికారంలో ఉన్న పార్టీ చెప్పాల్సింది. సామాన్య జనానికి అర్ధమయ్యే తీరులో బోధపరచి తమకు అనుకూలంగా మార్చుకోవాల్సింది. కానీ వైసీపీ మంత్రులు వాగాడంబరంతో చేస్తున్న అతి చేష్టలు అసలు ఉద్దేశ్యాలను మరుగున పడేస్తున్నాయి. అభివృధ్ధి వికేంద్రీకరణ మా లక్ష్యమని చెప్పుకుంటున్న వైసీపీ సర్కార్ పెద్దలు ఆ విషయాలను జనంలోకి తీసుకెళ్ళగలుస్తున్నారా అంటే లేదనే చెప్పాలి. వారు ఎంతసేపు చంద్రబాబు ట్రాప్ లో చిక్కుకుని అవినీతి మీద ప్రత్యారోపణలు చేస్తున్నారు. ఆ యాగీలో అసలు విషయాలు మరుగున పడిపోతున్నాయిఇది ఇపుడు ఏపీలో కాక రేపుతున్న అంశం. ఇది పచ్చి వ్యాపార పదం. ఇది ఇపుడు ప్రభుత్వ పెద్దలకు అవసరమా అన్నది ఆలోచన చేయాలి. కేవలం ఈ కారణంగానే రాజధానిని మారుస్తున్నామని చెప్పుకోవడం కంటే తెలివి తక్కువ వ్యవహారం మరోటి ఉండదు. అభివృధ్ధి ఎక్కడ చేసినా అది భూమి మీదనే చేయాలి. అటువంటపుడు ఆ ప్రయోజనాలు అక్కడ ఉన్న వారికి చేరక మానవు. లేకపోయినా వారు ఆ భూములను అమ్ముకుంటే తరువాత కొనుక్కున్న వారైనా ఫలితాలు పొందుతారు. అమరావతి రాజధాని విషయంలోనూ ఇదే జరిగింది. జనానికి దీని వల్ల నష్టం లేదు, లాభమూ లేదు. కానీ ఇదే విషయాన్ని పదే పదే చెప్పడం ద్వారా రాజధాని తరలింపు కేవలం ఇంత చిన్న కారణంతో చేస్తారా అని అంతా నివ్వెరపోయేలా వైసీపీ మంత్రుల వాదనలు ఉన్నాయిఅభివృధ్ధి అన్నది ఒక్క చోట కుప్పపోసి ఉంటే హైదరాబాద్ తరహాలో విభజన గొడవలు వస్తాయని, మిగిలిన ప్రాంతాలు ఇబ్బందుల్లో పడతాయని రోజుకు పదిమార్లు అయినా వైసీపీ మంత్రులు చెప్పినపుడు రాజధాని తరలింపునకు జనం నుంచి సానుకూలత వస్తుంది. లేకపోతే చంద్రబాబు అంటున్నట్లుగా తన మీద కక్షతోనే రాజధాన్ని తీసుకుపోతున్నారని, బంగారు బాతుని చంపేస్తున్నారన్న మాటలనే జనాలు నమ్మాల్సివస్తోంది. అందుకే రాజధాని విశాఖలో అంటూ కాకిగోల పెడుతున్నా కూడా అక్కడ స్పందన పెద్దగా లేదు, ఇక రాయలసీమ వాసులకు చంద్రబాబు హైకోర్టు బెంచ్ ఇస్తానంటే ఏకంగా హైకోర్టునే ఇస్తామని జగన్ చెప్పినా కూడా వారు కూడా సంతోషంగా లేరంటే అది ప్రభుత్వ పెద్దల పసలేని వ్యూహాలే కారణంగా చెప్పాలి.
No comments:
Post a Comment