Breaking News

03/01/2020

బోస్టన్ కమిటీ ఓ బోగస్ కమిటీ : టీడీపీ నేతలు

విజయవాడ జనవరి 3 (way2newstv.in): 
రాజధాని అమరావతి భవితవ్యంపై నివేదిక ఇవ్వనున్న బోస్టన్ కమిటీపై టీడీపీ నేతలు తవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శుక్రవారం మాజీ మంత్రి దేవినేని ఉమా, మాజీ ఎమ్మెల్యే బోండా ఉమా మీడియాతో మాట్లాడుతూ బోస్టన్ కమిటీ ఓ బోగస్ కమిటీ అని విమర్శించారు. న్యూయార్క్ అవతల బోస్టన్ నగరంలో ఉన్న సంస్థ బోస్టన్ సంస్థ అని... అమెరికాలో ఉన్న బోస్టన్ సంస్థకు అసలు అమరావతి మీద అవగాహన ఉంటుందా అని ప్రశ్నించారు. 
బోస్టన్ కమిటీ ఓ బోగస్ కమిటీ : టీడీపీ నేతలు


అమరావతిలో ఏమేమీ ఉన్నాయో, ప్రజలు.. వారి విధానాల గురించి ఏదైన అవగాహన ఉందా అని నిలదీశారు. జీఎన్ రావు ఇచ్చిన రిపోర్ట్‌నే బోస్టన్ కమిటీ ఇస్తుందని వారు అన్నారు. హైపర్ కమిటీ కూడా ఓ బోగస్ కమిటీ అని ఈ బోగస్ కమిటీలు వేసి రాజధాని తరలించాలని చూస్తే ఊరుకునేది లేదని దేవినేని ఉమా, బోండా ఉమా హెచ్చరించారు.

No comments:

Post a Comment