Breaking News

03/01/2020

రాయపాటిపై ఈడీ కేసు నమోదు

హైదరాబాద్‌ జనవరి 3 (way2newstv.in)
టీడీపీ మాజీ ఎంపీ రాయపాటిపై ఈడీ కేసు నమోదయ్యింది. నిధుల మళ్లింపు విషయంలో రాయపాటిపై ఈడీ అధికారులు కేసు నమోదు చేశారు. ఫెమా చట్టం కింద రాయపాటితో పాటు ట్రాన్స్‌టాయ్‌ కంపెనీలపై ఈడీ కేసు నమోదు చేసింది. రూ.16 కోట్లు సింగపూర్‌, మలేషియాకు మళ్లించినట్టు అధికారులు గుర్తించారు. ఇప్పటికే రాయిపాటితో పాటు కుమారుడు రామారావు, ట్రాన్స్‌ట్రాయ్‌ కంపెనీపై సీబీఐ కేసు నమోదైన విషయం తెలిసిందే. 
రాయపాటిపై ఈడీ కేసు నమోదు

15 బ్యాంకుల నుంచి రూ.8832 కోట్లు కంపెనీ రుణం తీసుకున్నది. రూ.3822 కోట్లు దారి మళ్లించినట్టు సీబీఐ అనుమానం వ్యక్తం చేస్తోంది. సింగపూర్‌, మలేషియా, రష్యాలకు నిధులు మళ్లించినట్టు అభియోగాలు ఉన్నాయి.కాగాసీబీఐ వచ్చినప్పుడు తాను కంపెనీలో లేనని.. తనిఖీలు చేసి ఏమీ లేదని సీబీఐ అధికారులు వెళ్లిపోయారని చెప్పిన సంగతి తెలిసిందే. సీబీఐ కేసుతో తనకెలాంటి సంబంధం లేదని.. కంపెనీ వ్యవహారాలన్నీ సీఈవో చూసుకుంటున్నారని రాయపాటి స్పష్టం చేశారు.

No comments:

Post a Comment