Breaking News

09/01/2020

సంక్రాంతికి సై (పశ్చిమగోదావరి)

ఏలూరు, జనవరి 09 (way2newstv.in): 
సంక్రాంతి సంప్రదాయం పేరుతో పందేల నిర్వహణకు రంగం సిద్ధమవుతోంది. కొందరు ముందస్తుగా సన్నాహక పందేలను కూడా భారీగా నిర్వహిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా పందేల నిర్వహణకు పందెం రాయుళ్లు ఒకే చోటకు చేరేలా ప్రస్తుతం పల్లెల్లో సన్నాహక పందేలు జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతికి ముందు, నూతన సంవత్సరం ప్రారంభం నాటి నుంచి పల్లెల్లో పందేలు నిర్వహిస్తారు. సంక్రాంతిలాగా షామియానాలు, విద్యుత్తు దీపాలు వంటి ఏర్పాట్లు లేకున్నా చిన్న బరుల్లో పందేలు నిర్వహిస్తున్నారు. ఇదంతా సంక్రాంతికి నిర్వహించే కోడి పందేలకు సిద్ధమవ్వడానికే అని తెలుస్తోంది. ఏటా కోడి పందేలపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరిస్తున్నా.. చివరి దశలో మూడు రోజుల పాటు చూసీచూడనట్లు వ్యవహరించడం ఆనవాయితీగా మారుతోంది. 
సంక్రాంతికి సై (పశ్చిమగోదావరి)

ఈ ఏడాది కూడా అదే పరిస్థితి ఉంటుందని.. పందేల నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు ఉండవని నిర్వాహకులు బాహాటంగానే ప్రచారం చేసుకుంటున్నారు. పండుగ సందర్భంగా బరులను ఎక్కడ ఏర్పాటు ఎక్కడ చేయాలనే విషయంలో వారు ఓ స్పష్టతకు వచ్చినట్లు తెలుస్తోంది. పండుగ నేపథ్యంలో జిల్లాలో ఏదోమూల కోడి పందేలు జరుగుతూనే ఉన్నాయి. పండుగ వేళ జూదగాళ్లకు పగ్గాలు వేయడం పోలీసులకు పెద్దసవాలే. జిల్లాలో ఉండి, భీమవరం, పాలకొల్లు, దెందులూరు, చింతలపూడి, ఆకివీడు, బుట్టాయగూడెం, ఉంగుటూరులో ఎక్కువగా పందేలు నిర్వహిస్తున్నట్లు సమాచారం. ప్రారంభంలో పందేలు నిర్వహించడంపై పోలీసులు ఆంక్షలు విధిస్తున్నారు. కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు. అయితే జూదగాళ్లు మాత్రం సంక్రాంతి సందర్భంగా పోటీలకు భారీ సంఖ్యలో పుంజులను సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో చాలా ప్రాంతాల్లో ఏడాది కిందట నుంచే ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి మరీ పెంచుతున్నారు. వాటి పోషణకు ప్రత్యేక ఆహారంతో పాటు వాటిని పందేనికి సిద్ధం చేసేందుకు ప్రత్యేకంగా మనుషులను కూడా ఏర్పాటు చేస్తున్నారు. వీటిలో అనేక రకాల కోళ్లు ఉన్నాయి. ఆక్వా చెరువుల దగ్గర సైతం పెద్ద ఎత్తున పుంజులకు ప్రత్యేక ఏర్పాట్లు చేసి పెంచుతున్నారు. జిల్లాలో దాదాపు 200 చోట్ల దాడులు నిర్వహించారంటే కోడి పందేలా జోరు ఏ స్థాయిలో ఉందో ఊహించవచ్ఛు

No comments:

Post a Comment