దేవినేని ఉమ
విజయవాడ జనవరి 09 (way2newstv.in)
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత చంద్రబాబును దుర్భాషలాడడం కొడాలి నాని మూర్ఖత్వానికి నిదర్శనమని మాజీ మంత్రి దేవినేని ఉమ అన్నారు. జగన్ భావాలనే కొడాలి నాని బయటికి చెబుతున్నారని చెప్పారు. కొడాలి నాని టికెట్ కోసం.. చంద్రబాబు దగ్గర చేతులు కట్టుకొని నిలబడిన విషయం మర్చిపోవద్దని హితవు పలికారు.
రాజధానిలో జగన్ పాదయాత్ర చేయగలరా?
దమ్ముంటే రాజధాని గ్రామాల్లో జగన్ను పాదయాత్ర చేయాలని చెప్పాలన్నారు. అప్పుడు మూడు రాజధానుల నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంటారని తెలిపారు. ప్రభుత్వ పతనానికి నిన్ననే నాంది పడిందని ఆయన వ్యాఖ్యానించారు.
No comments:
Post a Comment