Breaking News

11/01/2020

నేరస్తులకు శిక్షపడేలా కృషి చేస్తేనే ప్రజలకు పోలీసులపై నమ్మకం కలుగుతుంది

 జిల్లా ఎస్పీ అపూర్వ రావు
వనపర్తి జనవరి 11, (way2newstv.in):
కోర్టు కానిస్టేబుళ్లు ప్రతి కేసుల్లో నిందితులకు శిక్షలు పడే విధంగా కృషి చేస్తేనే ప్రజలకు పోలీసుల పై నమ్మకం జరుగుతుందని జిల్లా ఎస్పీ అపూర్వ రావు సూచించారు.జిల్లా పోలీసు కార్యాలయంలోని సమావేశం భవనంలో  జిల్లా ఎస్పీ శ్రీమతి *కె,అపూర్వరావు కోర్టు మానిటరింగ్  విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుళ్లకు శనివారం సమీక్ష నిర్వహించారు.ముందుగా కోర్టు కానిస్టేబుళ్లను కోర్టులో విచారణ లో ఉన్న కేసులు, శిక్షలు పడిన కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సమీక్ష సమావేశంలోఆమే  మాట్లాడుతూ.కేసునమోదయినప్పటినుండి కేసుపూర్తయ్యేవరకు నిందితుల నేరాలను నిరూపించడంలోకోర్టుకానిస్టేబుళ్ల బాధ్యత చాలా కీలకమైనదని అన్నారు.
నేరస్తులకు శిక్షపడేలా కృషి చేస్తేనే ప్రజలకు పోలీసులపై నమ్మకం కలుగుతుంది

చీటింగ్ కేసుల విషయంలో విచారణమనీ ల్యాండరింగ్ కేసులలో జాగ్రత్తగా వ్యవహరించాలని, కేసుకు సంబందించిన సమగ్ర వివరాలు సేకరించాలని సూచించారు.కోర్టు కేసులలో శిక్షల శాతం మరింత పెరిగేందుకు  దొంగతనం, వైట్ కాలర్ నేరాలు, ఆర్థిక సంబంధ నేరాల విషయంలో విచారణ పటిష్ఠంగా చేయడానికి పబ్లిక్ ప్రాసిక్యూటర్లకు అవసరమైన సహకారాన్ని అందించాలని తెలిపారు.బాధితులకు న్యాయము నేరస్తులకు శిక్షలు పడే విధంగా  కోర్టు విధులు నిర్వహించేవారు సరియైనసమయంలో సాక్షులను మరియు కేసులకుసంబంధించిన వివరాలను కోర్టుకు అంధించి నేరస్తులకు శిక్షలు పడేవిధంగా వారు విధులను నిర్వహించాలన్నారు.అదేవిధంగా కోర్టులో విచారణలో ఉన్నా కేసులను పెండింగులో ఉంచకూడదునీ సి‌సి నంబర్స్ త్వరగా తీసుకొని నేరస్తులకు శిక్షలు పడే విధంగా సాక్ష్యాలను ప్రవేశ పెట్టి కేసు ట్రైల్ సమయములో అట్టి కేసులకుసంబంధించిన వివరాలను సాక్ష్యులకు తెలియపర్చి న్యాయస్థానములో సరియైన విధముగా సాక్ష్యం చెప్పుటకొరకు వారికి అవగాహన కల్పించి నేరస్తులకు శిక్షలు పడేవిధంగా కోర్టుకానిస్టేబుళ్ల విధులు ఉండాలని తెలిపాఫు.కోర్టు విధులలో చక్కటి ప్రతిభ కనపరిచి కేసులలో నేరస్తులకు శిక్షలు పడే విధంగా పనిచేసి శిక్షలశాతం పెంచి ప్రజలకు న్యాయం చేసే విదంగా పనిచేయాలన్నారు.ఉత్తమ ప్రతిభ కనబరిచిన కోర్టు సిబ్బందికి ప్రతినెల రివార్డులు అందజేస్తామని ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని సూచించారు.కోర్టు డ్యూటీ సిబ్బంది   పిటి కేసుల అప్డేట్ చేయుట గురించి,లాంగ్ పెండింగ్ కేసుల ఆస్తి నమోదు రిజిస్టర్ నిర్వహణ, ప్రాపర్టీ ఇండెక్స్ నవీకరణ చేసుకోవాలని, సమ్మన్స్ సర్వ్ చేయుట గురించి , వార్రెంట్స్ అమలు పరిచేవిధానంగురించి, రోజు వారీ ప్రాసెస్ నిర్వహణ రిజిస్టర్ ను నవికరించుకోవాలని ,కోర్ట్ క్యాలెండర్ ను సిద్ధం చేసుకొని ఎస్ హెచ్వో మరియు కోర్ట్ గదులలో ప్రదర్శింప చేసుకోవాలని, ఎప్పటికప్పుడు సీసీ నెంబర్ లను పొందేటట్లు చూసుకోవాలని, సాక్షులు, ముద్దాయి లు కోర్ట్ కు సరైన సమయంలో హాజరయ్యేలా చూసుకోవాలని కోర్టు డ్యూటీ అధికారులకు సూచించారు.ఈశిక్షణకార్యక్రమంలోడిసీఆర్బీ సిఐ, జమ్ములప్ప,ఐటీ సెల్ ఇంచార్జి గోవింద్ ,ఐటీసెల్ సిబ్బంది, మన్యం, మరియు జిల్లాలోని అన్ని పోలీస్టేషన్ల   కోర్టుకానిస్టేబుళ్లు పాల్గొన్నారు.

No comments:

Post a Comment