Breaking News

24/01/2020

27న కోలువు తీరనున్న పాలక మండళ్లు

హైద్రాబాద్, జనవరి 24  (weay2newstv.in)
మున్సిపల్ సంఘాల్లో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికకు ముహూర్తం ఫిక్స్ అయింది. మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ముగిసిన నేపథ్యంలో మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎన్నికకు సంబంధించి నోటిఫికేషన్‌‌ను రాష్ట్ర ఎన్నికల సంఘం గురువారం (జనవరి 23) జారీ చేసింది. జనవరి 27న కొత్త పాలక మండళ్ల తొలి సమావేశం జరగనుంది. తొలి సమావేశంలోనే మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్ల ఎన్నిక ప్రక్రియ నిర్వహించనున్నారు.జనవరి 27న కొత్తగా ఎన్నికైన సభ్యుల ప్రమాణస్వీకారం అనంతరం మధ్యాహ్నం 12:30 గంటలకు మేయర్లు, ఛైర్మన్ల ఎన్నిక జరగనుంది. ఆ వెంటనే డిప్యూటీ మేయర్లు, వైస్‌ ఛైర్మన్ల ఎన్నిక నిర్వహించనున్నారు. 
27న కోలువు తీరనున్న పాలక మండళ్లు

ఈ ప్రక్రియకు సంబంధించిన నోటీసును శనివారం (25న) జారీ చేయనున్నారు.రాష్ట్రంలో బుధవారం నిర్వహించిన మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా 71.41 శాతం పోలింగ్ నమోదైంది. 120 మున్సిపాలిటీల్లో 74.73% పోలింగ్ నమోదు కాగా.. 9 నగర పాలక సంస్థల్లో (మున్సిపల్ కార్పొరేషన్లు) 58.86 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు తెలిపారు. పలు ప్రాంతాల్లో 90 శాతానికి పైగా పోలింగ్ నమోదవడం విశేషం.సాధారణ ఎన్నికలతో పోలిస్తే మున్సిపల్‌ ఎన్నికల్లో పట్టణ ఓటర్లు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.జిల్లాల్లోని మున్సిపాలిటీలతో పోలిస్తే.. హైదరాబాద్‌ శివారు మున్సిపాలిటీల్లో పోలింగ్‌ శాతం తక్కువగా నమోదైంది. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌లో అత్యధికంగా 93.31 శాతం పోలింగ్ నమోదైంది. నిజాంపేట కార్పొరేషన్‌లో అత్యల్పంగా 39.65 శాతం ఓట్లు పోలయ్యాయి. జనవరి 25న ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు వెల్లడించనున్నారు.

No comments:

Post a Comment