హైద్రాబాద్, జనవరి 24, (weay2newstv.in)
స్కూల్ ఎడ్యుకేషన్లోని స్థితిగతులు తెలుసుకునేందుకు విద్యాశాఖ అధికారులు రెడీ అవుతున్నారు. ఫిబ్రవరి మొదటి వారం నుంచి యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్‌ఫర్మేషన్ సిస్టం ఫర్ ఎడ్యుకేషన్ (యూడైస్) 2019–20 వివరాల సేకరణకు షెడ్యూల్ విడుదల చేశారు. ఇప్పటికే దీనిపై రాష్ట్ర స్థాయి వర్క్‌షాప్ నిర్వహిస్తున్నారు. ఏటా నవంబర్‌లోనే యూడైస్ లెక్కింపు స్టార్ట్ అయ్యేది. కానీ గతేడాది కేంద్రం సకాలంలో షెడ్యూల్విడుదల చేయకపోవడంతో ఏప్రిల్‌లో మొదలైంది. ఈ విద్యాసంవత్సరం మాత్రం కేంద్రం నుంచి ఇప్పటికే అనుమతి రావడంతో జనవరి నుంచి ఈ ప్రాసెస్ప్రారంభమైంది. యూడైస్ద్వారా అన్ని మేనేజ్మెంట్ల పరిధిలోని స్కూళ్లు, స్టూడెంట్స్, టీచర్లు, సిబ్బంది, కుల, మత వర్గాలతో పాటు స్కూళ్లలోని సదుపాయాల వివరాలు సేకరిస్తారు.
పాఠశాల స్థితిగతులపై అధ్యయనం
ఈ లెక్కల ఆధారంగానే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు కేటాయిస్తాయి కనుక ఈ ప్రాసెస్‌ను పాఠశాల విద్యాశాఖ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంటుంది. ఇప్పటికే 2019 –20కు సంబంధించి గుర్తింపున్న అన్ని మేనేజ్మెంట్ల స్కూళ్ల వివరాలను సమీకరించింది.వర్క్‌షాప్ తరువాత ఈనెల 25న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ గురుకులాలు, మోడల్ స్కూల్స్, ఇంటర్బోర్డు అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. 26వ తేదీ నుంచి30వ తేదీ వరకూ స్కూల్‌వైజ్‌గా ప్రింట్ చేసిన యూడైస్ డీసీఎఫ్ ఫారాలను జిల్లాలకు పంపిస్తారు. స్టూడెంట్స్సమాచారంతో యూడైస్‌కు లింక్ చేయడంతో విద్యార్థుల వివరాలు మరోసారి ప్రత్యేకంగా సేకరించాల్సిన అవసరం లేకుండా పోయింది. అయితే డీసీఎఫ్ఫారాల్లో పిల్లల వివరాలు ఏమైనా తప్పుగా ఉంటే సరి చేయాల్సి ఉంటుంది. ఇప్పటికే టీచర్ల డేటా కూడా ఆన్‌లైన్ చేయడంతో వివరాల సేకరణ ఈజీగా మారింది. 28న జిల్లాస్థాయిలో అన్ని గురుకులాల అధికారులు, విద్యాశాఖ అధికారుల సమావేశం, ఫిబ్రవరి 3న జిల్లాస్థాయిలో ఎంఈవోలు, ఎంఐఎస్కోఆర్డినేటర్లు, డాటా ఏంట్రీ ఆపరేటర్లు, కాంప్లెక్స్ హెడ్మాస్టర్లతో సమావేశం నిర్వహించి, దాంట్లో యూడైస్డీసీఎఫ్ఫారాలను వారికి అందజేస్తారు. ఫిబ్రవరి 5న మండలస్థాయి మీటింగ్నిర్వహించాల్సి ఉంటుంది. 6 నుంచి 8 వరకూ హెడ్మాస్టర్లు స్కూళ్లలోని వివరాలను ఫిల్ చేయాలి. ఈ వివరాలను ఫిబ్రవరి 10 నుంచి 13 వరకూ కాంప్లెక్స్హెచ్ఎం, సీఆర్పీలు స్క్రూటినీ చేయాలి. మండలస్థాయిలో 25శాతం, జిల్లాస్థాయి నుంచి మరోసారి ప్రతి మండలంలో ఐదు స్కూళ్ల డీసీఎఫ్ లను అధికారులు పరిశీలించి స్క్రూటినీ చేయాలి. ఇది పూర్తయిన తర్వాత ఫిబ్రవరి మూడు, నాలుగో వారంలో మండల, జిల్లాస్థాయిలో డాటా ఎంటర్ చేస్తారు. తప్పులు ఏమైనా వస్తే మార్చి మొదటి వారంలో తొలగించాల్సి ఉంటుంది. ఈ ప్రాసెస్ అంతా మార్చి రెండోవారంలోపు పూర్తవుతుంది.
No comments:
Post a Comment