Breaking News

04/12/2019

వెంకన్న సన్నిధిలో పవన్ కళ్యాణ్

తిరుమల డిసెంబర్ 4, (way2newstv.in)
ధర్మాన్నిమనం కాపాడితే ఆధర్మమే మనల్ని కాపాడుతుందని ఆ ఏడుకోండల వాడి సన్నిధిలో నేర్చుకున్నా దానిని త్రికరణ శుద్దిగా పాటిస్తానని జనసేన పార్టి అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. బుధవారం  ఉదయం వి.ఐ.పి విరామ సమయంలో స్వామి వారి సేవలో పాల్గోని మొక్కులు తీర్చుకున్నారు..
వెంకన్న సన్నిధిలో పవన్ కళ్యాణ్

అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వాదం చేయగా..ఆలయ అధికారులు పట్టు వస్త్రంతో సత్కరించి స్వామి వారి తీర్ధ ప్రసాదాలు అందజేసారు.. అనంతరం ఆలయ వెలుపలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. స్వామి వారిని దర్శించుకోవడం నా అదృష్టంగా భావిస్తున్నానని, దేశ, రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్ధించినట్లు ఆయన తెలిపారు.. రెండు, మూడు దశాబ్దాల క్రితం తిరుపతిలో యోగా అభ్యసం నేర్చుకున్నట్లు ఆయన తెలియజేసారు..

No comments:

Post a Comment