Breaking News

04/12/2019

ప్రోఫెషనల్ కాలేజీలపై గురి...

వచ్చే ఏడాది 300 కాలేజీలపై వేటుకు సిద్ధం
హైద్రాబాద్, డిసెంబర్ 4, (way2newstv.in)
రాష్ర్టంలోని ప్రైవేటు ప్రొఫెషనల్, టెక్నికల్కాలేజీల గుర్తింపు అంశం మరోసారి తెరపైకి వచ్చింది. రూల్స్కు విరుద్ధంగా ఉన్న కాలేజీలకు 2020–21లో అఫ్లియేషన్ఇచ్చే విషయమై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ఏఐసీటీఈ (ఆల్ఇండియా కౌన్సిల్ఫర్టెక్నికల్ఎడ్యుకేషన్) తాజాగా ప్రకటించడం.. జీవో నంబర్111ను కఠినంగా అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుండటంతో ప్రైవేటు ప్రొఫెషనల్కాలేజీల మేనేజ్మెంట్లు అయోమయంలో పడ్డాయి. ఏఐసీటీఈ రూల్స్, జీవో నంబర్ 111.. రెండూ అమలైతే ఏకంగా 200లకు పైగా కాలేజీలు గుర్తింపు కోల్పోయే ప్రమాదం ఉందని అధికారులు చెప్తున్నారు.రాష్ర్టంలో సుమారు 800లకు పైగా ప్రొఫెషనల్ కాలేజీలున్నాయి. 
 ప్రోఫెషనల్ కాలేజీలపై గురి...

ఆయా కాలేజీల్లో ఉండే ఇన్ఫ్రాస్ర్టక్చర్కు అనుగుణంగా ఏఐసీటీఈ గుర్తింపు ఇస్తుంది. ఆయా కాలేజీల్లో ఫ్యాకల్టీ, వసతులను పరిశీలించి యూనివర్సిటీలు అనుబంధ గుర్తింపు ఇస్తుంటాయి. వసతుల్లేవన్న కారణంతో ఓ ప్రైవేటు కాలేజీ గుర్తింపును నాలుగేండ్ల క్రితం ఏఐసీటీఈ రద్దు చేసింది. దీంతో ఆ కాలేజీ ప్రతినిధి తనలాగే మిగిలిన కాలేజీలకు వసతులు, బిల్డింగ్ అనుమతులు లేవని, వాటిపైనా చర్యలు తీసుకోవాలని ఏఐసీటీఈకి ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో అన్ని కాలేజీల్లో ఏఐసీటీఈ తనిఖీలు చేసింది. 238 ప్రొఫెషనల్ కాలేజీలు జీవో నంబర్ 111లోని రూల్స్కు, ఏఐసీటీఈ రూల్స్కు విరుద్ధంగా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. ప్రధానంగా బిల్డింగ్రెగ్యులరైజేషన్, బిల్డింగ్మాస్టర్ప్లాన్, హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ అనుమతులతోపాటు ఇతర వసతులు లేవని తేల్చారు. దీంతో వసతులు సమకూర్చుకునేందుకు ఏఐసీటీఈ నుంచి కాలేజీల మేనేజ్మెంట్లు అనుమతి తీసుకున్నాయి. ఆయా కాలేజీలకు ఇచ్చిన గడువు 2019 అక్టోబర్ 31తో ముగిసింది. ఈనేపథ్యంలో అనుమతులు, సరైన పత్రాలు ఇవ్వని కాలేజీలపై చర్యలు తీసుకుంటామని ఏఐసీటీఈ ప్రకటించింది. 238 కాలేజీల్లో ఇంజనీరింగ్కాలేజీలే ఎక్కువగా ఉంటాయని అధికారులు చెప్తున్నారు.వీటిలో కొన్ని కాలేజీల్లో వసతులు కల్పించినట్టు మేనేజ్మెంట్లు చెప్తున్నాయి. వీటి నుంచి మినహాయింపు కోసం ప్రభుత్వ పెద్దల చుట్టూ చక్కర్లు కొడుతున్నాయి.సుప్రీంకోర్టు తీర్పునకు అనుగుణంగా హైదరాబాద్ శివారులోని ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ సరస్సుల రక్షణ కోసం భవనాల నిర్మాణాలకు రూల్స్ రూపొందిస్తూ ఉమ్మడి రాష్ర్టంలో 1996లో అప్పటి సర్కారు జీవో నంబర్ 111 ఇచ్చింది. దీని ప్రకారం ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ దగ్గర 10 కిలోమీటర్ల పరిధిలోని 84 గ్రామాల్లో నిర్మాణాలపై ఆంక్షలు విధించింది. అయితే ఆ రూల్స్కు వ్యతిరేకంగా ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్లు పెద్దపెద్ద బిల్డింగ్స్నిర్మించాయి. దీంతో సుమారు 50 ప్రొఫెషనల్కాలేజీల్లో బిల్డింగ్రెగ్యులరైజేషన్ కు ప్రభుత్వం నిరాకరిస్తోంది. కాలేజీ అఫ్లియేషన్కు తప్పనిసరిగా బిల్డింగ్రెగ్యులరైజ్అయి ఉండాలనే రూల్ ఉంది. ఏటా ప్రభుత్వం షరతులతో కూడిన అనుమతులిస్తూ పోతోంది. ఉస్మాన్సాగర్, హిమాయత్సాగర్ సరస్సుల్లో నీళ్లు లేవు కాబట్టి జీవోను సవరించి, భవనాలకు అనుమతులు ఇవ్వాలనే డిమాండ్కూడా చాలా ఏండ్ల నుంచి ఉంది. కానీ ప్రభుత్వం దానిపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే ఇప్పుడు ఈ విషయంలో ప్రభుత్వం సీరియస్గానే ఉన్నట్టు తెలుస్తోంది. ఒకవేళ సర్కారు అనుమతి ఇవ్వకపోతే, దాదాపు 50 కాలేజీలకు గుర్తింపు రావడం కష్టమేనని అధికారులు అంటున్నారు.

No comments:

Post a Comment