సిరిసిల్ల డిసెంబర్ 02 (way2newstv.in)
రాజ్య సభ సభ్యులు జొగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గ్రీన్ చాలెంజ్ కార్యాక్రమం లో భాగంగా సోమవారం జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ సిరిసిల్ల మున్సిపాలిటీ కంపోస్ట్ , రిసోర్స్ పార్క్ లో మొక్కలు నాటారు. కరీంనగర్ ర్ జి ల్లా కలెక్టర్ ర్ సర్ఫరాజ్ అహ్మద్ విసిరిన గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించిన జిల్లా కలెక్టర్ గన్నేరు, జామ వంటి మొక్కలను నాటారు.అలాగే మరో 5 గురికి గౌరవ జెడ్పీ చైర్మన్ న్యాలకొండ అరుణ, వేములవాడ, చొప్పదండి, మానకొండూర్, చొప్పదండి ఎమ్మెల్యేలు రమేష్ బాబు, రసమయి బాలకిషన్, సుంకె రవి శంకర్,జిల్లా ఎస్పి రాహుల్ హెగ్డే లకు గ్రీన్ చాలెంజ్ ను స్వీకరించాలని సవాల్ విసిరారు. ఈ సందర్బంగా గ్రీన్ చాలెంజ్ కార్యాక్రమాన్ని రాజ్య సభ సభ్యులు జొగినపల్లి సంతోష్ కుమార్ ప్రతిష్టాత్మకంగా చేపట్టినందుకు వారికి ధన్యవాదాలు తెలిపారు.
గ్రీన్ చాలెంజ్ లో మొక్కలు నాటిన : జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్
ఈ సందర్బంగా కలెక్టర్ కృష్ణ భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో గ్రీన్ చాలెంజ్ కార్యాక్రమానికి అనూహ్య స్పందన వస్తుందని తెలిపారు. గ్రీన్ చాలెంజ్ ను ప్రతి ఒక్కరు స్వీకరించి మొక్కలు నాటుతు మరో 4 – 5 గురికి గ్రీన్ చాలెంజ్ లో మొక్కలు నాటాలని సవాల్ విసురుతున్నారని తెలిపారు. గ్రీన్ చాలెంజ్ ద్వారా ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని వాటిని సంరక్షణకు కృషి చేయాలని కలెక్టర్ కోరారు. జిల్లాలోని ఖాళీ స్థలాలో, చెరువు గట్లపైన, రహదారుల వెంబటి ప్రతి ఇంటిలో మొక్కలు నాటి, జిల్లాను పచ్చదనం తో నింపుటకు హరిత తెలంగాణలో భాగస్వామ్యులు కావాలని కలెక్టర్ కోరారు.ఈ కార్యక్రమం లో సిరిసిల్ల మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, డీపీఆర్వో మామిండ్ల దశరథం, మున్సిపల్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ రఘు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
No comments:
Post a Comment