Breaking News

02/12/2019

పోసాని కామెంట్స్ పై మండిపడుతున్న జనం

హైద్రాబాద్, డిసెంబర్ 2, (way2newstv.in)
ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం అంత చెడిపోయిన దేశం మరోటి లేదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు సినీ రచయిత, నటుడు పోసాని కృష్ణ మురళి. దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన వెటర్నరీ డాక్టర్ దిశ హత్య, రేప్ ఘటనలో నిందితులైన ఆ నలుగురు యువకులు పెద్ద క్రిమినల్స్ కాదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు పోసాని.భారతదేశం చాలా మంచిదే.. కాని దేశంలో ఉన్న క్రైమ్, అవినీతి ఎక్కడా లేదు. ముందుగా ప్రజా వ్యవస్థ నీతిగా ఉండాలి అది నీతిగా లేదు. రాజకీయ వ్యవస్థ, పోలీస్ వ్యవస్థ, ఉద్యోగ వ్యవస్థ ఏదీ నీతిగా లేదు. సమాజంలో ఉన్న ఎవడూ నీతిగా ఉండకుండా సమాజం నీతిగా ఉండాలంటే ఎలా ఉంటుంది. రేప్ చేశారు కాబట్టి చంపేయండి అంటే ఇప్పుడు ప్రయోజనం లేదు. ఈ నలుగుర్నే చంపుతారు..
పోసాని కామెంట్స్ పై మండిపడుతున్న జనం

 ఇలాంటి వాళ్లు కోట్లలో ఉన్నారు.మనం ఎలాంటి నాయకులను ఎన్నుకుంటున్నాం.. ఎలాంటి వాళ్లను మనం పోలీస్‌లుగా నియమించుకుంటున్నాం. ఎలాంటి వాళ్లకు ఉద్యోగం ఇస్తున్నాం.. ఎలాంటి వాళ్లను బాబాలుగా కొలుస్తున్నాం.. వీటన్నింటిపై మనకు మనం క్వచ్ఛన్ వేసుకుంటే ఆన్సర్ దొరికేస్తోంది. వీళ్లతో పోల్చుకుంటే దిశాని రేప్ చేసి మర్డర్ చేసిన నిందితులు పెద్ద క్రిమినల్స్ కాదనేది నా లెక్క. ఒక అమ్మాయి జీవితాన్ని నాశనం చేశారు. ఉరి వేస్తే చచ్చిపోతారు. కాని అవినీతి, అక్రమాలు, రేప్‌లు జరుగుతూనే ఉంటాయి. వ్యవస్థ నీతిగా ఉంటే క్రైమ్ జరగకుండా ఉంటుంది.తప్పు జరిగినప్పుడు ఉరి తీయడం లాంటివి అరబ్ కంట్రీస్‌లో చూస్తుంటాం. అవన్నీ వేస్ట్ అనేది నా అభిప్రాయం. అరబ్ కంట్రీస్‌లో చట్టాలతో పాటు మనుషులు కూడా కరెక్ట్‌గా ఉంటారు. అందుకే క్రైమ్ జరగదు.దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించిన దిశ రేప్, హత్యపై చాలా బాధపడుతున్నా.. అయితే అందరం బాధపడటం వల్ల ఉపయోగం ఉండదు. 90 శాతం మంది జనం కరెక్ట్‌గా లేదు. ఈ నలుగుర్నీ చంపేస్తే 130 కోట్ల మందిలో మార్పు రాదు. వ్యవస్థ మారితే అందర్లో మార్పువస్తోంది. ముందుగా జనం మారాలి.ఇక నాయకులతో పాటు జనం కూడా చాలా దారుణంగా ఉన్నారు. డబ్బులు ఇస్తేనే ఓట్లు వేస్తున్నారు. మార్పు కావాలి? అంతా మరాలి అంటున్నారు. ముందు వీడు కదా మారాలి. డబ్బు తీసుకోకుండా సేవ చేసే నాయకుడ్ని ఎన్నుకోవాలి. రాజకీయ, ఉద్యోగ వ్యవస్థలతో పాటు జనం వ్యవస్థ మారాలి. ప్రపంచ వ్యాప్తంగా భారతదేశం అంత చెడిపోయిన దేశం మరోటి లేదు.భారతదేశ వ్యవస్థ ఎంత దారుణంగా ఉందంటే.. చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేస్తున్నారు.. ఇది ఇలాగే కొనసాగితే.. పుట్టిన బిడ్డను కాదు.. పుట్టబోయే బిడ్డకోసం కూడా ఎదురుచూస్తుంటాడు కామాంధుడు. తొమ్మిదినెలల కడుపుతో ఉన్న ఆమెకు పుట్టబోయేది ఆడబిడ్డ అని తెలిస్తే ఎప్పుడు డెలివరీ అవుతుందా? పుట్టిబోయే ఆ పసికందును రేప్ చేద్దామా.. అని కాచుకుని కూర్చుంటాడు రేపిస్ట్. ఆ లెవల్‌కి వస్తుంది భారతదేశం.ఇలాంటి సంఘటనలను అరికట్టడానికి నిర్భయ చట్టాన్ని తీసుకుని వచ్చారు. అది వ్యవస్థలో మార్పు కోసం కాదు.. క్రైం అండ్ పనిష్మెంట్ కోసమే. దీని ప్రకారం ఎంతమందిని చంపుతాం. ఎంత మందికి ఉరి శిక్ష వేస్తాం. ఇలా ఉరి వేసుకుంటూ పోతే.. కనీసం భారతదేశంలో ఉన్న 100 కోట్ల మందికి ఉరి శిక్ష వేయాల్సి ఉంటుంది. దొంగవేటు వేసేవాడితో సహా ఉరితీయాలి. డబ్బు తీసుకుని ఓటు వేసేవాడు రేపిస్ట్‌ కంటే డేంజర్. ఈరోజు ఒక అమ్మాయిని చంపేశారని బాధ పడటం కాదు.. భారతదేశమే చనిపోతుంది.నా కూతురు కనిపించడం లేదని స్టేషన్‌కి వెళ్తే.. అక్కడ డ్యూటీలో ఉన్న పోలీస్ బాయ్ ఫ్రెండ్‌తో వెళ్లిందా.. అని అడుగుతాడా? సరే వాడు అడిగాడు. ఇప్పుడు సస్పెండ్ చేస్తారు. తిరిగి ఏ ఎమ్మెల్యే, ఎంపీనో పట్టుకుని మళ్లీ ఉద్యోగం వేయించుకుంటాడు. వ్యవస్థ ఇంత వక్రమార్గంలో వెళ్తున్నప్పుడు ఇలాంటి పోలీస్‌లు ఎందుకు డ్యూటీ సక్రమంగా చేస్తారు.మా బంధువుల అమ్మాయి ఒకరు ఉన్నారు. ఎమ్ టెక్ చేసింది. ఆ అమ్మాయికి ఈ మధ్యనే ఘనంగా పెళ్లి చేశాం. వాడు ఆ అమ్మాయిని దగ్గరకు రానీయకుండా హింసిస్తున్నాడు. కొడుతున్నాడు. వాడు మగాడో, ఆడవాడో కూడా తెలియదు. అక్కడ ఎస్ ఐ ఉన్నాడు.. అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి నేను ఎస్ పితో మాట్లాడాల్సి వచ్చింది. అయితే వాడు ఓ రాజకీయనాయకుడి దగ్గరకు వెళ్లాడు. చివరికి పొలిటిషీయన్ మాటే గెలిచింది. ఎస్ పి మాట చెల్లలేదు. ఆ అమ్మాయి అలాగే ఏడుస్తూ ఉంటుంది. ఆ పెళ్లి చేసుకున్న వాడు ఎమ్మెల్యే తాలుకా మనిషి. నా కళ్ల ముందు జరుగుతున్న అన్యాయం చూసే నేను పిచ్చోడినయ్యా. మోసం చేసిన వాడిని ఎమ్మెల్యే కాపాడుతుంటే నాలాంటి వాడు ఏం చెప్పాలి’ అంటూ సంచలన కామెంట్స్ చేశారు పోసాని

No comments:

Post a Comment