Breaking News

05/12/2019

ఆత్మ స్వచ్చత సాధన దిశగా అడుగులు వేయాలి ::

రాష్ట్ర వైద్యారొగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్
పెద్దపల్లి ,డిసెంబర్ 05 (way2newstv.in)
ఆత్మ స్వచ్చత సాధన దిశగా మనమంతా అడుగులు వేయాల్సిన సమయం ఆసన్నమైందని  రాష్ట్ర వైద్యారొగ్య శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.  గురువారం   స్థానిక  రెడ్డి ఫంక్షన్ హల్ లో  పెద్దపల్లి ఎమ్మేల్యే  అధ్యక్షతన  ఎర్పాటు చేసిన  స్వచ్చత నుండి స్వస్థత వరకు దిశానిర్థేశ అభినందన సభను  ఆయన   రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్ తో కలిసి  జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.  ఈ సందర్భంగా   రాష్ట్ర వైద్యారొగ్య శాఖ మంత్రి మాట్లాడుతూ   చిన్న జిల్లాల ఎర్పాటు ద్వారా ప్రజలకు  పాలన చేరువచేసి మంచి ఫలితాలు  సాధిస్తామన్నా  సీఎం కేసీఆర్  ఆలోచనలను    పెద్దపల్లి జిల్లా నిజం చేసిందని  అన్నారు.  
ఆత్మ స్వచ్చత సాధన దిశగా  అడుగులు వేయాలి ::

 పెద్దపల్లి జిల్లా ఎర్పడిన తరువాత  దేశవ్యాప్తంగా స్వచ్చతలో ముందు వరుసలో ఉండి  జాతీయ అవార్డు పొందడంతో పాటు   మన  రాష్ట్రానికి  మంచి  పేరు  తీసుకొనివచ్చిందని అన్నారు.  మనం మన పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు మన ఆత్మలను, ఆలోచనా విధానాన్నీ సైతం  స్వచ్చంగా ఉంచుకోవాలని, ఆ దిశగా కృషి చేయాల్సిన సమయం వచ్చిందని  మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు.  ఇటీవల శంషాబాద్ లో  జరిగిన దిశ సంఘటన పట్ల ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు.   దేశ వ్యాప్తంగా  ఈ సంఘటన  మహిళా లోకం ఆవేదనకు గురిచేసిందని అన్నారు.  సీఎం కేసిఆర్ ఎప్పుడు  నాయకుడి ఆలోచన విధానం ద్వారా  ప్రజలలో మార్పు సాధ్యమవుతుందని విశ్వసిస్తారని,  ప్రస్తుతం పెద్దపల్లి జిల్లాలో సైతం  కలెక్టర్ గారి నేతృత్వంలో  స్వచ్చత అంశంలో మంచి మార్పు సాధ్యమయిందని ఆ స్పూర్తితో ఆలొచనలో కుడా ఇతరులకు హని కల్గించని విధంగా సమాజం రుపుదిద్దుకునే దిశగా అవసరమైన   కార్యక్రమాలు  పెద్దపల్లి నుంచి ప్రారంభించాలని మంత్రి  సూచించారు.   దేశీయ సంస్కృతి విధానంలో  స్వచ్చత ఉందని, మనం పాశ్చాత్య సంస్కృతి మాయలో పడి స్వచ్చతను  కొంతకాలం విస్మరించామని   అన్నారు.   మహిళలు ఆవేదనకు గురికావడం మంచిది కాదని, దేశానికి  రాష్ట్రానికి మంచి జరగదని అన్నారు.    మన సంస్కృతి,  పెద్దలు  మహిళల పట్ల మర్యాదగా ప్రవర్తించాలో మనకు నేర్పించారని, ఒక తల్లి పట్ల, ఒక వదిన పట్ల , ఒక  అక్క  పట్ల, ఒక చెల్లి పట్ల మనం చుపే  గౌరవభావంతో సమాజంలో ఇతర మహిళలను చుడాలని అన్నారు.  మహిళలను గౌరవించాలని, ప్రస్తుత సమాజంలో  పెరుగుతున్న సాంకేతికను మనం మంచికి వినియోగించుకోవాలని,  సెల్ ఫోన్లలో యువత అధికంగా  అశ్లీల చిత్రాలు, అసాంఘిక చర్యలను తిలకించడం  దుర్మార్గమని, వీటి వల్ల అనేక నష్టాలు జరుగుతున్నాయని, మనం మన పిల్లలు ఏ విధంగా పెరుగుతున్నారొ ఎల్లప్పుడు గమనిస్తు ఉండాలని  మంత్రి తెలిపారు.  మహిళల పట్ల దుర్మార్గపు ఆలొచనల్ని రుపుమాపే దిశగా మనమంతా ఐక్యంగా ముందుకు సాగాలని మంత్రి అన్నారు. సమాజంలో  ప్రతి తల్లిదండ్రి వారి పిల్లలకు సామాజిక స్పృహ కల్పించాలని మంత్రి తెలిపారు. దిశ ఘటనలోని  నేరానికి పాల్పడిన వారికి  వీలైనంత త్వరలో అత్యంత కఠినమైన  ఊరి శిక్ష వేసేలా ప్రభుత్వం కృషి చేస్తుందని,  వారి ఊరి తీయడం సమస్యకు శాశ్వత పరిష్కారం కాదని, భవిష్యత్తులో  మహిళల పట్ల దాడులు జర్గకుండా   మంచి సమాజం రుపుదిద్దుకోవాలని ఆయన అన్నారు.   అదే విధంగా ప్రస్తుతం  పారిశ్రామికరణ, ఆధునికరణ కారణాల వల్ల  పర్యావరణ కాలుష్యం పెరుగుతుందని, దీని వల్ల ప్రజలు అనారొగ్య సమస్యలకు గురి అవుతున్నారని,    పర్యావరణ కాలుష్య నివారణకు ప్రభుత్వం హరితహారం కార్యక్రమం ప్రారంభించిందని,  అందులో భాగంగా గ్రామాలో నాటిన మొక్కలను మనం పూర్తి స్థాయిలో సంరక్షించుకోవాలని మంత్రి పిలుపునిచ్చారు.  పెద్దపల్లి జిల్లాలో గత సంవత్సరం అధికంగా డెంగ్యూ కేసులు నమోదయ్యాయని, కాని ఈ సంవత్సరం ఇంకుడగుంతల నిర్మాణం వల్ల గణనీయంగా డెంగ్యూ కేసులు తగ్గుముఖం పట్టాయని  మంత్రి తెలిపారు.  స్వచ్చత నుండి స్వస్థత  సాధించేందుకు  రుపొందించిన పంచసూత్రాలను సైతం విజయవంతంగా పూర్తి స్థాయిలో అమలు చేయాలని, అధికారలు ప్రజాప్రతినిధులు  కలిసి ఐక్యతతో ప్రజా భాగస్వామ్యంతో స్వచ్చ గ్రామాల సాధన దిశగా పనిచేయాలని మంత్రి పిలుపునిచ్చారు.గ్రామాభివృద్దికి  అధిక  ప్రాధాన్యం గ్రామాల అభివృద్దికి  ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తుందని  రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి  కొప్పుల ఈశ్వర్ అన్నారు.  నూతన రాష్ట్రం ఏర్పడిన తరువాత  అనేక దీర్ఝకాలిక సమస్యలను  ప్రభుత్వం ముఖ్యమంత్రి అధ్యక్షతన  అధిగమించిందని అన్నారు.  విద్యుత్, సాగునీరు, త్రాగు నీరు అందించే దిశగా సీఎం చేసిన కృషి సత్పలితాలందిస్తుందని  మంత్రి తెలిపారు.  రాష్ట్ర ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ప్రారంభించిన 30 రోజుల ప్రత్యేక కార్యచరణ నిరంతర ప్రక్రియగా కొనసాగాలని, ప్రజాప్రతినిధులు వారి గ్రామాలో స్వచ్చత కార్యక్రమాలను  కొనసాగించాలని,  అంతర్గత రహదారులను  పరిశుభ్రంగా ఉంచుకోవాలని మంత్రి సూచించారు.  గ్రామ పంచాయతిలకు ఉన్న      కరెంట్ బకాయిలను ప్రభుత్వం నేరుగా భరిస్తుందని, గ్రామ పంచాయతిలు  ప్రతి నెల వారికి వచ్చే కరెంట్  బిల్లులను చెల్లించాలని ఆదేశించారు.  ప్రజలను భాగస్వామ్యం చేస్తు గ్రామాలో శ్రమదానం కార్యక్రమం నిర్వహించాలని సూచించారు.  స్వచ్చత నుండి స్వస్థత సాధన దిశగా రుపొందించిన పంచసూత్రాల కార్యక్రమం పకడ్భందిగా అమలు జరిగేలా క్షేత్రస్థాయిలో కృషి చేయాలని మంత్రి  కోరారు.

No comments:

Post a Comment